భారత్‌తో మూడో టెస్టు: పెరీరా 'సెంచరీ' | Dilruwan Perera's 100th Test wicket after Dhawan departs | Sakshi
Sakshi News home page

భారత్‌తో మూడో టెస్టు: పెరీరా 'సెంచరీ'

Published Sat, Dec 2 2017 10:39 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

Dilruwan Perera's 100th Test wicket after Dhawan departs - Sakshi

ఢిల‍్లీ:శ్రీలంకతో ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఆరంభమైన చివరిదైన మూడో టెస్టులో భారత్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌లు ప్రారంభించారు. అయితే ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లోనే భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(23) మొదటి వికెట్‌ గా పెవిలియన్‌ చేరాడు. లంక స్పిన్నర్‌ దిల్రువాన్‌ పెరీరా బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

పెరీరా వేసిన ఆఫ్‌ బ్రేక్‌కు తడబడిన ధావన్‌.. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కాగా, ఇది పెరీరాకు వంద టెస్టు వికెట్‌ కావడం ఇక్కడ విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడని శిఖర్‌ ధావన్‌ తిరిగి జట్టులో చేరగా, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో మొహ్మద్‌ షమీ తుది జట్టులోకి వచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement