ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తాజాగా స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ భాయ్ తన రిటైర్మెంట్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
వార్నర్ మాట్లాడుతూ.. "వచ్చే ఏడాది నా అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరిది కావచ్చు. 2024లో అమెరికా, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతాను. అక్కడ అద్భుతంగా రాణించి మా జట్టుకు టైటిల్‌ను అందించడమే నా లక్ష్యం. అప్పుడు గర్వంగా క్రికెట్ నుంచి తప్పుకుంటాను.
నేను రెండేళ్ల పాటు బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాను. కాబట్టి అక్కడ కూడా మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నాను. ఇక ప్రస్తుతం మాకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు పెద్దగా లేవు. కాబట్టి నేను టెస్టులు, వన్డే క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి భావిస్తున్నాను. అదే విధంగా వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాకు చాలా కీలకం" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment