
జహీర్‌ఖాన్‌కు సన్మానం
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ జహీర్ ఖాన్‌ను ఆదివారం ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఘనంగా సత్కరించింది. ఐదో వన్డే ముగిసిన అనంతరం ఎంసీఏ తరఫున జహీర్‌కు సచిన్ టెండూల్కర్ ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జహీర్, తన కెరీర్‌లో అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు రైతుల సంక్షేమం కోసం గతంలో ఎంసీఏ ప్రకటించిన రూ. కోటి చెక్‌ను కూడా స్థానిక క్రికెటర్లు రోహిత్ శర్మ, రహానేలతో కలిసి ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అందజేశారు.