ఇదీ సెహ్వాగ్ ఘనత..
భారతీయ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన శైలీలో ఆడి ఘనతను చాటాడు. వన్డే, టెస్టు మ్యాచ్ లలో దూకుడుగా ఆడి సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ చరిత్రలో చెరగని ముద్రను వేశాడు. భారత క్రికెటర్ గా ప్రపంచస్థాయిలో తన ప్రస్థానం కొనసాగించి.. కుడిచేతి వాటం గల బ్యాట్స్ మెన్ గానూ, బౌలింగ్ లోనూ, హాఫ్ స్పిన్నర్ గానూ అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగి ఆడాడు. ఇన్నేళ్లా సుదీర్ఘ ప్రయాణంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు.
► భారత్ తరపున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ 20 మ్యాచ్లు ఆడిన సెహ్వాగ్
► వన్డేల్లో 15 సెంచరీలు, టెస్టుల్లో 23 సెంచరీలు
► 251 వన్డేల్లో 8273 పరుగులు
► 104 టెస్టుల్లో 8586 పరుగులు
► 19 టీ 20 మ్యాచ్ల్లో 394 పరుగులు