Rohit Sharma Special Message Completing 15 years International Cricket - Sakshi
Sakshi News home page

Rohit Sharma Debut On This Day: 15 ఏళ్ల కెరీర్‌ పూర్తి.. రోహిత్‌ శర్మ ఎమోషనల్‌

Published Thu, Jun 23 2022 1:51 PM | Last Updated on Thu, Jun 23 2022 2:18 PM

Rohit Sharma Special Message Completing 15 years International Cricket - Sakshi

23 జూన్‌.. ఈ తేదీ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం. ఇదే రోజున టీమిండియా ధోని సారధ్యంలో 2013లో ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపీని గెలుచుకుంది. అయితే ఇదే రోజుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ అంతర్జాతీయ ‍క్రికెట్‌లో అడుగుపెట్టిన రోజు కూడా ఇదే.

2007, జూన్‌ 23న బెల్‌ఫాస్ట్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా హిట్‌మ్యాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తాజాగా నేటితో 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ పూర్తి చేసుకున్న రోహిత్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకుంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ''ఈ రోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్ల నా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురానుభూతులు.. ఒడిదుడుకులు, చీకటి రోజులు ఉంటాయి. కానీ వాటిన్నింటిని అదిగమిస్తూ ఈస్థాయికి చేరుకున్నానంటే దానికి మీ అందరి సపోర్ట్‌ ఒక కారణం. అందుకే నా ప్రయాణంలో మద్దుతగా నిలిచిన క్రికెట్‌ లవర్స్‌, అభిమానులు, విమర్శలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.'' అంటూ ముగించాడు. 

క్రికెట్‌లో రోహిత్‌ శర్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా మిడిలార్డర్‌లో వచ్చిన రోహిత్‌ శర్మ సరైన ఫామ్‌ కనబరచలేక జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. సెహ్వాగ్‌, సచిన్‌ల రిటైర్మెంట్‌ తర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌ శర్మకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్డేల్లో భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుగా రోహిత్‌ శర్మ నిలిచాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్‌ సెంచరీలు కొట్టిన ఏ‍కైక బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన రికార్డు కూడా రోహిత్‌ పేరిటే ఉంది.


2014, నవంబర్‌ 13న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు బాదాడు. ఆ తర్వాత 2019 అక్టోబర్‌ 5న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలగడంతో సారధ్య బాధ్యతలు ఎత్తుకున్న రోహిత్‌కు ఇంగ్లండ్‌ పర్యటన ఒక సవాల్‌ అని చెప్పొచ్చు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విదేశాల్లో ఇదే తొలి సిరీస్‌ అని చెప్పొచ్చు. ఇక  రోహిత్‌ శర్మ టీమిండియా తరపున 228 వన్డేల్లో 9283 పరుగులు.. 44 టెస్టుల్లో 3076 పరుగులు, 124 టి20ల్లో 3,308 పరుగులు సాధించాడు. రోహిత్‌ ఖాతాలో వన్డేల్లో 29 సెంచరీలు, 8 టెస్టు సెంచరీలు, 4 టి20 సెంచరీలు ఉన్నాయి.

చదవండి: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్‌ ఖాన్‌

నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement