టీమిండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంఎస్ ధోనిది ప్రత్యేక స్థానం. ధోనిలో మంచి నాయకుడితో పాటు మంచి ఆటగాడు కూడా ఉన్నాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో మొదటిది కలుపుగోలు తనం. అదే ఆయనలో ప్రస్పుటంగా కనిపించేది. సీనియర్ క్రికెటర్ల నుంచి ఇప్పటి ఆటగాళ్ల వరకూ అందరి పట్ల ఆయన ఎంతో అభిమానం చూపించడమే కాకుండా, స్నేహభావంతో మెలుగుతారు. ఈ క్రమంలోనే తన కెప్టెన్సీ సక్సెస్ గురించి టాప్ సీక్రెట్ చెప్పేశాడు ధోని.
ఇటీవల 37వ బర్త్‌డే జరుపుకున్న ధోని.. టీమిండియా జట్టుతో అనుభవాల గురించి వెల్లడిస్తూ.. ‘ప్రతీ ఒక్కరికీ కామన్ సెన్స్ అనేది ఉంటుంది. దాన్ని సమర్ధంగా ఉపయోగించుకోగలిగే ప్రతిఒక్కరూ నాయకులే. జట్టులో ప్రతి ఒక్కరి మనోభావాలనూ గౌరవించాలి. వారిని ఆటకు సన్నద్ధం చేయడం ఎంత ముఖ్యమో వారి అభిప్రాయాలను, నిర్ణయాలనూ గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జట్టులో తమ కెప్టెన్ పట్ల ఏ ఒక్క క్రికెటర్ అసంతృప్తి వ్యక్తం చేసినా కెప్టెన్‌గా విఫలమైనట్లే. మ్యాచ్ సందర్భంలో క్రికెటర్లు వేర్వేరుగా స్పందిస్తుంటారు. వారికి సర్ది చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. నావరకూ అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కామన్ సెన్స్‌తో ఆలోచిస్తా. అదే నా కెప్టెన్సీ రహస్యం’ అని ధోని వివరించాడు.
‘ఏం మాట్లాడుతన్నారీయన..మాకెందుకు చెబుతున్నారు? మాకు ఇది కూడా తెలీదా' అనే మాటలు జట్టులో ఎవరో ఒకరు అంటూనే ఉంటారని నేను విన్నాను. కానీ నా విషయంలో నాకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు' అని ధోని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment