
సిడ్నీ: ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా విధ్వంసక ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఎన్నికయ్యాడు. ఈ నెల 24 నుంచి యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఫించ్ సారథ్యం వహించనున్నాడు. తొలి సారి వినూత్నంగా ప్రయత్నించిన సెలక్షన్ కమిటీ ఇద్దరు వైస్ కెప్టెన్‌లను నియమించింది. దీంతో మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ వైస్ కెప్టెన్‌లుగా అవకాశం లభించింది. ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కెప్టెన్సీతో ఆకట్టుకున్న ఫించ్‌పై పూర్తి నమ్మకం ఉందని కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ‘పొట్టి క్రికెట్‌లో ఫించ్ అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను జట్టును ముందుండి నడిపించగలడు’ అంటూ ఫించ్‌ను కోచ్ లాంగర్ ప్రశంసలతో ముంచెత్తాడు. గాయాలతో గత సిరీస్‌కు దూరమైన క్రిస్ లిన్, కౌల్టర్‌నైల్ తిరిగి జట్టులోకి రాగా, యువ స్పిన్నర్ ఆడమ్ జంపా, బెన్ మెక్ డెర్మాట్ సైతం చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment