హైదరాబాద్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బరిలోకి దిగనుంది. హైదరాబాద్ ఫ్రాంచైజీకి గత మూడేళ్లలో మారిన నాలుగో కెప్టె కమిన్స్! ఈ మూడేళ్లలో మార్క్‌రమ్ (దక్షిణాఫ్రికా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), డేవిడ్ వార్నర్ (ఆ్రస్టేలియా)లు సన్‌రైజర్స్‌ను నడిపించారు. 30 ఏళ్ల స్పీడ్‌స్టర్ కమిన్స్ నాయకత్వంలో ఆ్రస్టేలియా 2023 వన్డే ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ టైటిల్స్‌ను సాధించింది.
2021 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టులోనూ కమిన్స్ సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో కమిన్స్‌పై సన్‌రైజర్స్ రూ. 20 కోట్ల 50 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. తాజాగా మార్క్‌రమ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి కమిన్స్‌కు సన్‌రైజర్స్ పగ్గాలు అప్పగించింది. గతంలో కమిన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు కానీ... కెప్టెన్‌గా మొదటిసారి ఐపీఎల్‌లో జట్టును నడిపించబోతున్నాడు. గత సీజన్‌లో మార్క్‌రమ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లు ఆడి నాలుగే మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment