2019 ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా ధోని!
ఇంగ్లండ్‌లో 2019లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు తనలో క్రికెట్ ఆడే సత్తా ఉందని ధోని గతంలో అనేకమార్లు చెప్పాడు. భారత సెలక్టర్లు కూడా దీనితో అంగీకరించినట్లు కనిపిస్తోంది. వచ్చే ప్రపంచకప్ వరకు భారత జట్టు కెప్టెన్‌గా ధోనిని కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లతో సమానంగా ధోని ఫిట్‌నెస్ ఉంది.
ధోని జట్టుతో కొనసాగితే సెలక్టర్ల పని కూడా సులభమవుతుంది. ఎప్పుడు రిటైర్ అవ్వాలో అతనికే బాగా తెలుసు. ఏవైనా గాయాలైతే తప్ప వచ్చే ప్రపంచకప్ వరకూ తను జట్టుతోనే ఉంటాడు’ అని ఒక సెలక్టర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.