Rana Daggubati Released Arya Captain First Look Poster Kollywood - Sakshi
Sakshi News home page

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కోసం ఏడాదిన్నర సమయం పట్టిందట!

Published Wed, Apr 6 2022 8:56 AM | Last Updated on Wed, Apr 6 2022 9:27 AM

Rana Daggubati Released Arya Captain First Look Poster Kollywood - Sakshi

తమిళసినిమా: కెప్టెన్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోమవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. టెడీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆర్య దర్శకుడు శక్తి సౌందర్‌ రాజన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోంది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థింక్‌ స్టూడియోస్, ది షో పీపుల్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇప్పుడు ట్రెండీగా మారింది.

విశేషం ఏమిటంటే ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కోసం చిత్ర యూనిట్‌ ఏడాదిన్నరగా శ్రమించారట. కారణం ప్రేక్షకులకు ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి వినూత్న అనుభూతిని కల్పించాలన్నదే అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఒక థ్రిల్లర్‌ పయనంగా ఉంటుందన్నారు. చిత్రం కోసం ఆర్య చూపించిన అంకితభావం, శ్రమ మాటల్లో చెప్పలేదని నిర్మాతలు పేర్కొన్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్‌ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువ ఛాయాగ్రహణం, డి.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

చదవండి: Palasa 1978 Movie: 'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్‌కు ఎంపిక 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement