పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం సాధించిన కోహ్లి..భారత తరపున టెస్టుల్లో అత్యధికంగా సెంచరీలు చేసిన కెప్టెన్లలో నాల్గోవాడిగా నిలిచాడు. 191బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్ లో 13 వ సెంచరీ కాగా, భారత కెప్టెన్ గా ఆరో సెంచరీ.