Sri Lanka First Test Captain Bandula Warnapura Passed Away: శ్రీలంక టెస్ట్ జట్టుకు తొట్ట తొలి సారధిగా వ్యవహరించిన బందుల వర్ణపుర(68) సోమవారం మృతి చెందాడు. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల అతను మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 1982 ఫిబ్రవరిలో కొలొంబొ వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక ఆడిన తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వర్ణపుర.. శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌గా, తొలి పరుగు చేసిన ఆటగాడిగా.. అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ చేసిన తొలి ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్ మొత్తంలో 4 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన అతను.. 1975 ప్రపంచకప్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. రిటైర్మెంట్ అనంతరం అతను శ్రీలంక కోచ్‌గా కూడా వ్యవహరించాడు.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లా ఆల్‌రౌండర్
Bandula Warnapura Passed Away: శ్రీలంక క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ మృతి..
Published Mon, Oct 18 2021 4:54 PM | Last Updated on Mon, Oct 18 2021 4:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment