ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ సంచలన ప్రకటన చేసింది. గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా ఎవరూ ఊహించని కొత్త వ్యక్తి పేరు తెరపైకి తెచ్చింది. కేకేఆర్ తమ తాత్కాలిక కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడు నితీశ్ రాణా పేరును ప్రకటించింది. వెన్ను సమస్య కారణంగా అయ్యర్ 2023 సీజన్ తొలి అర్ధ భాగం మ్యాచ్‌లకు దూరం కానున్న నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా, కేకేఆర్ యాజమాన్యం నితీశ్ రాణావైపు మొగ్గుచూపింది.
Official statement. @NitishRana_27 #AmiKKR #KKR #Nitish #NitishRana pic.twitter.com/SeGP5tBoql
— KolkataKnightRiders (@KKRiders) March 27, 2023
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా పని చేసిన అనుభవాన్ని, 2018 నుంచి కేకేఆర్‌తో ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని రాణాను ఎంపిక చేసినట్లు కేకేఆర్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ బృందమంతా నితీశ్‌కు సహరిస్తుందని మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నితీశ్ రాణాను ఆల్ ద బెస్ట్ చెప్పిన కేకేఆర్ యాజమాన్యం.. శ్రేయస్ అయ్యర్ త్వరగా గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించింది.
కాగా, అయ్యర్ గాయం ప్రకటన వెలువడ్డాక కేకేఆర్ కెప్టెన్సీ రేసులో చాలా మంది పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. కొందరు సునీల్ నరైన్ అంటే మరికొందరు సౌథీ, రసెల్, శార్దూల్ ఠాకూర్ పేర్లు తెరపైకి తెచ్చారు. అయితే మేనేజ్‌మెంట్ అనూహ్యంగా నితీశ్ పేరును కెప్టెన్‌గా ఓకే చేసి అందరి అంచనాలకు పటాపంచలు చేసింది.
2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాణా.. ఇప్పటివరకు 91 మ్యాచ్‌లు ఆడి 2181 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016 నుంచి 2018 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాణా.. అప్పటి నుంచి వరుసగా 6 సీజన్ల పాటు (2023 కలుపుకుని) కేకేఆర్‌కే ఆడుతున్నాడు. గత సీజన్ వేలంలో రాణాను కేకేఆర్ 8 కోట్లకు సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment