
కేకేఆర్ కీలక ప్రకటన (PC: KKR/IPL)
IPL 2024- KKR Captain Announcement: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయ్యర్ కెప్టెన్సీలో నితీశ్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.
కాగా వెన్నునొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రాణా సారథ్యంలో కేకేఆర్ ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో ఆరు మాత్రమే గెలిచింది.
అయ్యర్ లేని లోటు పూడ్చేందుకు
తద్వారా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ మాజీ చాంపియన్. అయితే, శ్రేయస్ అయ్యర్ లేని లోటును పూడ్చేందుకు నితీశ్ రాణా ప్రయత్నించిన తీరుపై మాత్రం ప్రశంసలు కురిశాయి.
ఇక కేకేఆర్ సారథిగా పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయినా.. బ్యాటర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు నితీశ్ రాణా. ఐపీఎల్-2023లో పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున రింకూ సింగ్(474) తర్వాత రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కేకేఆర్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్న అయ్యర్
ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడం సహా వన్డే వరల్డ్‌కప్-2023లో వరుస సెంచరీలతో అదరగొట్టడంతో.. మరలా అతడిని కెప్టెన్‌గా నియమిస్తూ కేకేఆర్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గత ఎడిషన్ కెప్టెన్ నితీశ్ రాణాను అతడికి డిప్యూటీగా నియమించింది.
ఈ సందర్భంగా శ్రేయస్ అయ్యర్‌కు తిరిగి స్వాగతం పలుకుతూనే.. తమ అభ్యర్థన మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నితీశ్ రాణాకు ధన్యవాదాలు తెలిపింది. అదే విధంగా శ్రేయస్ సైతం.. తన గైర్హాజరీలో రాణా జట్టును ముందుకు నడిపించిన తీరు అద్భుతమంటూ ప్రశంసించడం విశేషం.
చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్!
Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023