ముంబై: జింబాబ్వేలో పర్యటించనున్న భారత వన్డే జట్టు నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించగా... ఇప్పుడు అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేశారు. జులై 30న ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టుకు ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కోవిడ్‌నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రాహుల్‌ను ఈ సిరీస్‌ను ఎంపిక చేయలేదు.
అయితే ఇప్పుడు రాహుల్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షించిందని, అన్నీ చక్కబడటంతో అతడిని జట్టులోకి తీసుకున్నామన్న బీసీసీఐ...కెప్టెన్‌గానూ నియమించింది. దాంతో శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్సీకి మారాడు. రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నా, ఎవరినీ తప్పించకుండా 16 మందితో టీమ్‌ను బోర్డు ప్రకటించింది. భారత్, జింబాబ్వే మధ్య ఈ నెల 18, 20, 22 తేదీల్లో హరారేలో 3 వన్డేలు జరుగుతాయి.
జట్టు వివరాల: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మొహమ్మద్ సిరాజ్.
చదవండి: ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
Comments
Please login to add a commentAdd a comment