
‘‘ప్రేక్షకుల అభిరుచులు మారాయి. కొత్తదనం ఉంటేనే థియేటర్స్‌కు వస్తునారు. ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌లతో నిర్మాతలకు కాస్త డబ్బులు వస్తునప్పటికీ, ఓ సినిమా థియేటర్స్‌లో విడుదలై హిట్ సాధించినప్పుడు లభించేదే నిజమైన సక్సెస్ అని నా ఫీలింగ్’’ అనారు హీరో ఆర్య. ‘టెడ్డీ’ సినిమా తర్వాత హీరో ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘కెప్టెన్ ’. ఆర్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తునారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆర్య చెప్పిన విశేషాలు...
► ‘టెడ్డీ’ తర్వాత శక్తి సౌందర్ రాజన్ నాకు ‘కెప్టెన్ ’ కథ చెప్పారు. మరో దర్శకుడు అయితే ‘కెప్టెన్ ’కు నో చెప్పేవాడినేమో. కానీ శక్తి సౌందర్ రాజన్ తో నాకు పని చేసిన అనుభవం ఉంది. ఆయనకు సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్)పై ఎంత పట్టు ఉందో నాకు అవగాహన ఉంది. అందుకే ‘కెప్టెన్ ’ సినిమాకు ఓకే చెప్పాను. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం.
► ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ విజయ్ కుమార్ పాత్ర చేశాను. ఓ వింత జీవితో పోరాటం చేయడమే ‘కెప్టె’ కథ. విజయ్ కుమార్, అతని బృందం ఈ వింత జీవితో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఈ వింత జీవి వల్ల మానవాళికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? అనే అంశాల సమాహారమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో ఆర్మీ బ్యాక్‌డ్రాప్ ఉంది కాబట్టి ప్రతి అంశాని చాలా జాగ్రత్తగా డీల్ చేశాం. మాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే అది ఆర్మీ వారిని తక్కువ చేసినట్లుగా ఉండకూడదనుకుని సెట్‌లో ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ను నియమించుకునాం.
► ఈ సినిమాలోని క్లైమాక్స్ సనివేశాల చిత్రీకరణ నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో కొని సనివేశాలను చిత్రీకరించాం. ట్రైలర్, టీజర్స్‌లో కనిపించినట్లుగా వింత జీవి నా ముందు ఉండదు. ఉందని ఊహించుకుని యాక్ట్ చేయాలి. ఇది చాలా కష్టంగా అనిపించింది. ఇక వింత జీవి అనేది గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే.
► ‘టెడ్డీ’, ‘సారపట్టై’.. ఇప్పుడు ‘కెప్టెన్ ’...ఇలా వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తునాను అంటే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటానని కాదు. సాధారణంగా నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటుంటాను. రిస్కీ స్క్రిప్ట్స్ ఉన దర్శకులు వేరే హీరోలు ఎవరూ చేయకపోతే నా దగ్గరకు వస్తారు. నేనైతే ప్రొడ్యూస్ కూడా చేస్తానని నాతో చాన్ ్స కూడా తీసుకుంటుంటారు. ‘కెప్టెన్ ’ సినిమాకు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. అయితే ఈ సినిమా విజయంపై మాత్రమే అది ఆధారపడి ఉంది.
► నితిన్ నాకు మంచి స్నేహితుడు. కమల్‌హాసన్ గారి ‘విక్రమ్’ సినిమా శ్రేష్ఠ్ మూవీస్ ద్వారానే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ లిస్ట్‌లో ఇప్పుడు ‘కెప్టెన్ ’ సినిమా కూడా చేరుతుందనే నమ్మకం ఉంది. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తాను. అలాగే కథ నచ్చితే నా భార్య సాయేషాతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉనాను.
Comments
Please login to add a commentAdd a comment