తండ్రి కాబోతున్న క్రికెటర్!
భారత క్రికెటర్ సురేశ్ రైనా ఆనందాల జల్లులో తడిసిముద్దవుతున్నాడు. ఐపీఎల్ లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా అయినప్పటి నుంచి అదృష్ట దేవత రైనా చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజా ఐపీఎల్‌లో రైనా నాయకత్వం వహిస్తున్న గుజరాత్ జట్టు ఇప్పుడు టాప్ పోజిషన్ లో ఉంది. అదే సమయంలో అతన్ని మరో స్వీట్ న్యూస్ ఊరిస్తోంది.
రైనా తండ్రి కాబోతున్నడు. త్వరలోనే రైనా భార్య ప్రియాంక తమ మొదటి బిడ్డను ప్రవవించబోతున్నది. ఈ శుభసందర్భంగా అతను ఐపీఎల్ నుంచి విరామం తీసుకొని తన భార్యను కలిసేందుకు హాలాండ్ కు బయలుదేరాడు. 'హాలాండ్‌కు బయలుదేరాను. రేపు నా భార్యను కలువబోతున్నాను. ఇప్పుడు నాకెంతో ఎక్సైటింగ్‌గా ఉంది' అని రైనా తెలిపాడు. ఆదివారం కోల్‌కతా ఈడెన్స్ గార్డెన్స్‌లో నైట్ రైడర్స్ జట్టును గుజరాత్ టీమ్ చిత్తుగా ఓడించిన తర్వాత కెప్టెన్ రైనా ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు. అదేవిధంగా ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ, భార్య ఫొటోలను పోస్టుచేసి.. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపాడు.
#happymothersday ❤️mom❤️and to future mom can't wait to see you both