
నా ప్రమేయం లేకుండానే... సారథినయ్యా: కుంబ్లే
పనాజీ: టెస్టు జట్టుకు నాయకత్వం వహించేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం వల్లే తనను కెప్టెన్‌గా చేశారని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు.
పనాజీ: టెస్టు జట్టుకు నాయకత్వం వహించేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం వల్లే తనను కెప్టెన్‌గా చేశారని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఓవరాల్‌గా తన ప్రమేయం లేకుండానే సారథినయ్యానని చెప్పాడు. ‘భారత్‌కు 17 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెప్టెన్సీ వచ్చింది. టెస్టు కెప్టెన్సీపై ఎవరూ ఆసక్తి కనబర్చకపోవడంతో ఇది జరిగింది. ద్రవిడ్ అప్పుడే సారథ్యం నుంచి తప్పుకున్నాడు. ధోనికి బాధ్యతలు ఇవ్వడం తొందరపాటు అని భావించారు. సచిన్ అసలు ఇష్టం చూపలేదు.
దీంతో అందరూ నా వైపు చూశారు. నేను ఓకే చెప్పాల్సి వచ్చింది’ అని కుంబ్లే వెల్లడించాడు. తాను సారథ్యం స్వీకరించినప్పుడు భారత జట్టు సంధికాలంలో ఉందన్నాడు. దీన్ని సమర్థంగా ఎదుర్కొవాలనే ఉద్దేశంతో తాను బాధ్యతలకు ఒప్పుకున్నానన్నాడు.