కేన్ విలియమ్సన్
న్యూఢిల్లీ: నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను నియమించింది. ప్రస్తుతం అతను సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. ‘ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు సారథ్యం వహించనుండటం ఆనందంగా ఉంది. మేటి ఆటగాళ్లతో కూడిన బృందంతో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’నని కేన్ విలియమ్సన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు సన్‌రైజర్స్ ప్రకటించింది.
వార్నర్ వైదొలిగిన నేపథ్యంలో శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహాలలో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించినా... గత మూడు ఐపీఎల్ సీజన్‌లలో సన్‌రైజర్స్ తరఫున కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమించడం ఆశ్చర్యపరిచింది. ఒకవేళ ధావన్ లేదా సాహాలలో ఒకరిని సారథిగా ఎంపిక చేసి ఉంటే తొలిసారి ఐపీఎల్‌లో అన్ని జట్లకు భారతీయ ఆటగాళ్లే కెప్టెన్‌లుగా ఉండేవారు.
Comments
Please login to add a commentAdd a comment