
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా రూట్
ఊహించినట్టుగానే స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఇంగ్లండ్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
లండన్: ఊహించినట్టుగానే స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఇంగ్లండ్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో 0–4తో ఓటమి అనంతరం అలిస్టర్ కుక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కొత్త కెప్టెన్‌గా రూట్‌ను, వైస్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 53 టెస్టులు ఆడిన రూట్ 11 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 4,594 పరుగులు సాధించాడు.