
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్, పాతతరం క్రీడాకారిణి ఎల్వెరా బ్రిటో కన్ను మూశారు. 81 ఏళ్ల ఎల్వెరా బ్రిటో వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ‘బ్రిటో సిస్టర్స్’గా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎల్వెరా, రీటా, మయె భారత మహిళల హాకీ జట్టుకు చిరపరిచితులు.
జాతీయ టోర్నీలో 1960 నుంచి 1967 వరకు కర్ణాటక జట్టుకు ఏడు టైటిళ్లు అందించిన ఘనత బ్రిటో సిస్టర్స్‌ది! ఎల్వెరా బ్రిటో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు 1965లో ‘అర్జున అవారు’్డను అందజేసింది.