సందీప్‌కు జట్టు పగ్గాలు | Sandipku over the reins of the team | Sakshi
Sakshi News home page

సందీప్‌కు జట్టు పగ్గాలు

Published Thu, Nov 20 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

సందీప్‌కు జట్టు పగ్గాలు

సందీప్‌కు జట్టు పగ్గాలు

సీకే నాయుడు ట్రోఫీకి అండర్-23 జట్టు ఎంపిక

 సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో తలపడే హైదరాబాద్ అండర్-23 జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు బి. సందీప్ కెప్టెన్‌గా, అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు సభ్యులు గురువారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో కోచ్‌కు రిపోర్టు చేయాలి. గోవాలో వచ్చే నెల 1 నుంచి 4 వరకు జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు... గోవాతో తలపడుతుంది.

 జట్టు: బి. సందీప్ (కెప్టెన్), ఆకాశ్, కె.సుమంత్, హిమాలయ్ అగర్వాల్, అరుణ్ దేవా, ఆకాశ్ భండారీ, శరత్, చైతన్యకృష్ణ, వంశీవర్ధన్ రెడ్డి, రోహిత్ రాయుడు, అనిరుధ్, రవితేజ, ముజామిల్, సాకేత్ సాయిరామ్, రాజేంద్ర; కోచ్: అర్జున్ యాదవ్, మేనేజర్: నాగరాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement