Colonel CK Naidu Trophy
-
సీకే నాయుడు ట్రోఫీ విజేత ముంబై
అహ్మదాబాద్: బీసీసీఐ దేశవాళీ అండర్–25 టోర్నీ (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ)ను ముంబై సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై 75 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేయగా విదర్భ 385 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విదర్భ 121 పరుగులకే ఆలౌటైంది. ట్రోఫీని అందుకుంటున్న ముంబై కెప్టెన్ హార్దిక్ తమోరే -
సందీప్‌కు జట్టు పగ్గాలు
సీకే నాయుడు ట్రోఫీకి అండర్-23 జట్టు ఎంపిక సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో తలపడే హైదరాబాద్ అండర్-23 జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు బి. సందీప్ కెప్టెన్‌గా, అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు సభ్యులు గురువారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో కోచ్‌కు రిపోర్టు చేయాలి. గోవాలో వచ్చే నెల 1 నుంచి 4 వరకు జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు... గోవాతో తలపడుతుంది. జట్టు: బి. సందీప్ (కెప్టెన్), ఆకాశ్, కె.సుమంత్, హిమాలయ్ అగర్వాల్, అరుణ్ దేవా, ఆకాశ్ భండారీ, శరత్, చైతన్యకృష్ణ, వంశీవర్ధన్ రెడ్డి, రోహిత్ రాయుడు, అనిరుధ్, రవితేజ, ముజామిల్, సాకేత్ సాయిరామ్, రాజేంద్ర; కోచ్: అర్జున్ యాదవ్, మేనేజర్: నాగరాజు.