కరుణ్ నాయర్.. ఈ పేరు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. అతడు మన భారత క్రికెటరే. సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత టెస్టు క్రికెట్‌లో ఒక యువ సంచలనం. తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. అయితే అరంగేట్రం చేసిన ఐదు నెలలకే బీసీసీఐ అతడిని పక్కన పెట్టింది.
కరుణ్ నాయర్ అనే క్రికెటర్ ఉన్నాడన్న విషయాన్నే భారత సెలక్టర్లు మార్చిపోయారు. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. భారత జట్టు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. కానీ మళ్లీ భారత జెర్సీ ధరించేందుకు కరుణ్ నాయర్ మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉండగా..త్వరలో జరగనున్న రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన కర్ణాటక క్రికెట్ బోర్డు.. అతడికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ చేసిన ఓ పోస్టు అభిమానుల హృదయాలను తాకుతుంది.
"డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ" ట్విటర్ వేదికగా భావోద్వోగానికి లోనయ్యాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. "నీ లాంటి టాలెంట్ ఉన్న ఎంతో మంది ఆటగాళ్లను తొక్కేసారు" అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. మళ్లీ భారత జట్టులో తిరిగి నిన్ను చూడాలి అనుకుంటున్నాము భయ్యా అంటా పోస్టులు చేస్తున్నారు.
ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ
కరుణ్ నాయర్ 2016 నవంబర్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు.
Dear cricket, give me one more chance.🤞🏽
— Karun Nair (@karun126) December 10, 2022
Revisit Karun Nair triple century scoring moment.pic.twitter.com/MV1ERnUwFY
— Cricket Master (@Master__Cricket) December 10, 2022
చదవండి: FIFA WC: పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment