Karun Nair Century
-
అది నా చేతిలో లేదు.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: కరుణ్ నాయర్
దేశవాళీ క్రికెట్లో భారత వెటరన్ బ్యాటర్, విదర్భ స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. విదర్బ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 295 బంతులు ఎదుర్కొన్న కరుణ్.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో 5 సెంచరీలు చేసిన కరుణ్ నాయర్‌కు ఓవరాల్‌గా ఈ సీజన్లో ఇది 9వ శతకం కావడం విశేషం.అతడు సెంచరీ ఫలితంగా విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఆఖరి రోజు ఆటలో విదర్బ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 110.3 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం 37 పరుగులతో కలుపుకొని విదర్భ ఓవరాల్‌గా 324 పరుగుల ముందంజలో ఉంది. ఇక తన సెంచరీపై నాలుగో రోజు అనంతరం కరుణ్ నాయర్ స్పందించాడు."మైదానంలో అడుగుపెడితే పరుగులు సాధించడమే నా పని. ప్రస్తుతం అదే చేస్తున్నా. భారత జట్టుకు తిరిగి ఎంపికవడం నా చేతిలో లేదు. దానిపై ఏం వ్యాఖ్యానించలేను. ఈ మ్యాచ్‌కు ముందు 8 శతకాలు చేశాను. జట్టు సహాయ సిబ్బందితో దీని గురించి మాట్లాడా. ఈ రోజు సెంచరీ చేస్తే తొమ్మిదో అంకే చూపుతానని చెప్పా. అది సాధ్యమైంది కాబట్టే అలా సంజ్ఞ చేశా. నేను క్రీజులో అడుగుపెట్టినప్పుడు జట్టు 7/2తో ఉంది. దీంతో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలని ముందే అనుకున్నా.కొన్ని కఠిన సవాళ్లు ఎదురైన సెంచరీ పూర్తిచేసుకొని అజేయంగా నిలవడం ఆనందంగా ఉంది. ఆదివారం కూడా ఇదే ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాం. తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్ కావడం ఎంతో బాధించింది. లేకపోతే అప్పుడు కూడా శతకం సాధిస్తానని అనుకున్నా. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ ఓపిగ్గా ప్రయత్నించి పరుగులు రాబట్టా. నాకు ఇది నాలుగో రంజీ ట్రోఫీ ఫైనల్. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా" అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.చదవండి: IML 2025: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. భారత క్రికెటర్ భావోద్వేగం
కరుణ్ నాయర్.. ఈ పేరు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. అతడు మన భారత క్రికెటరే. సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత టెస్టు క్రికెట్లో ఒక యువ సంచలనం. తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. అయితే అరంగేట్రం చేసిన ఐదు నెలలకే బీసీసీఐ అతడిని పక్కన పెట్టింది. కరుణ్ నాయర్ అనే క్రికెటర్ ఉన్నాడన్న విషయాన్నే భారత సెలక్టర్లు మార్చిపోయారు. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. భారత జట్టు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. కానీ మళ్లీ భారత జెర్సీ ధరించేందుకు కరుణ్ నాయర్ మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా..త్వరలో జరగనున్న రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన కర్ణాటక క్రికెట్ బోర్డు.. అతడికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ చేసిన ఓ పోస్టు అభిమానుల హృదయాలను తాకుతుంది. "డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ" ట్విటర్ వేదికగా భావోద్వోగానికి లోనయ్యాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. "నీ లాంటి టాలెంట్ ఉన్న ఎంతో మంది ఆటగాళ్లను తొక్కేసారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ భారత జట్టులో తిరిగి నిన్ను చూడాలి అనుకుంటున్నాము భయ్యా అంటా పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ కరుణ్ నాయర్ 2016 నవంబర్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. Dear cricket, give me one more chance.🤞🏽 — Karun Nair (@karun126) December 10, 2022 Revisit Karun Nair triple century scoring moment.pic.twitter.com/MV1ERnUwFY — Cricket Master (@Master__Cricket) December 10, 2022 చదవండి: FIFA WC: పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్ -
‘డ్రా’తో గట్టెక్కిన భారత్ ‘ఎ’
దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టు కరుణ్ నాయర్ సెంచరీ వాయనాడ్ (కేరళ): ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు అనూహ్య ప్రతిఘటన కనబర్చింది. దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టును డ్రాగా ముగించగలిగింది. 73/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు శుక్రవారం ఆటను కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 309 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (192 బంతుల్లో 114; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. విజయ్ శంకర్ (142 బంతుల్లో 74 నాటౌట్; 12 ఫోర్లు), ముకుంద్ (200 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అతనికి అండగా నిలిచారు. చివరి రోజు విజయానికి భారత్ 371 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఇది కష్ట సాధ్యం కావడంతో భారత్ మ్యాచ్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. నాయర్, శంకర్ ఐదో వికెట్‌కు అభేద్యంగా 148 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించగా...రెండో రోజు ఆటలో భారత కెప్టెన్ రాయుడు (15) మాత్రమే విఫలమయ్యాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది.