IPL 2023- LSG- KL Rahul: భారత క్రికెటర్, ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023తో పాటు వచ్చే నెలలో లండన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నుంచి కూడా రాహుల్ తప్పుకున్నాడు.
దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత
ఈ విషయాన్ని స్వయంగా అతనే నిర్ధారించాడు. సోమవారం లక్నోలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. ‘భారత జట్టుకు అందుబాటులో లేకపోవడం చాలా నిరాశగా ఉంది. దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత. నా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు.
2021లో కేకేఆర్‌కు ఆడిన కరుణ్ నాయర్ (PC: IPL)
రీప్లేస్‌మెంట్ అతడే
వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తా. బాధగా ఉన్నా ఆటకు దూరం కావడం తప్పడం లేదు’ అని రాహుల్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌కు దూరమైన రాహుల్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కర్నాటక బ్యాటర్ కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకుంది. రూ. 50 లక్షల ధరకు అతడిని తీసుకుంది.
కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్... రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆయా జట్ల తరఫున మొత్తంగా 76 మ్యాచ్‌లు ఆడిన నాయర్ 1496 పరుగులు చేశాడు.
చదవండి: ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ అట..!
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. హీరోయిన్‌ను పెళ్లాడతాను..!
Comments
Please login to add a commentAdd a comment