
మూడోసారి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న రెండుసార్లు చాంపియన్ విదర్భ జట్టు ఈనెల 26 నుంచి కేరళ జట్టుతో జరిగే ఫైనల్ కోసం జట్టును ప్రకటించింది. గుజరాత్ జట్టుతో జరిగిన సెమీఫైనల్లో పోటీపడ్డ 17 మంది సభ్యులనే ఫైనల్ మ్యాచ్‌కూ కొనసాగించాలని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
అక్షయ్ వాడ్కర్ జట్టుకు సారథ్యంలోనే విదర్భ ఫైనల్లో బరిలోకి దిగుతుందని వీసీఏ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సీజన్‌లో విదర్భ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు అర్హత సాధించింది. గత ఏడాది 42 సార్లు రంజీ చాంపియన్ ముంబై జట్టు చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన విదర్భ ఈసారి మాత్రం ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఈ సీజన్‌లో యశ్ రాథోడ్ (933 పరుగులు), హర్‡్ష దూబే (66 వికెట్లు) నిలకడగా రాణించి విదర్భ జట్టు ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించారు. విదర్భ జట్టు 2017–18, 2018–19 వరుస సీజన్‌లలో రంజీ చాంపియన్‌గా నిలిచింది.
విదర్భ రంజీ జట్టు: అక్షయ్ వాడ్కర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అథర్వ తైడె, కరుణ్ నాయర్, ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్, యశ్ కదమ్, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, అమన్ మొఖాడె, అక్షయ్ కర్నెవార్, అక్షయ్ వఖారె, ఆదిత్య థాకరే, దర్శన్ నల్కండే, నచికేత్ భుటె, సిద్ధేశ్ వథ్, దానిశ్ మలెవార్, పార్థ్ రఖాడె.
చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్
Comments
Please login to add a commentAdd a comment