ranji trophy final
-
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. సచిన్ రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. ముషీర్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా ముషీర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సచిన్ సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో 29 ఏళ్ల సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు వాంఖడేకు వెళ్లారు. ఇక ఈ ఏడాది సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్బ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. -
సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్.. విజయం ముంగిట ముంబై
రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరుగుతున్న ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 141/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై.. 418 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ముషీర్ ఖాన్ మరో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. మరోవైపు భారత ఆటగాడు, ముంబై మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 14 నెలల తర్వాత అతడికిది తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. వీరిద్దరితో పాటు కెప్టెన్ అజింక్య రహానే(73), శామ్స్ ములాని(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబె ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ 3, ఆదిత్య థాక్రే, అమన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ధ్రువ్ షోరె (7), అథర్వ తైడే (3) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ.. ముంబై బౌలర్ల దాటికి 105 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై జట్టుకు 109 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ముంబై.. విధర్భకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! వీడియో వైరల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా విధర్బ జరుగుతున్న ఫైనల్లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ తుది పోరు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడిన అయ్యర్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అయ్యర్ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. జట్టులో చోటు మాత్రమే కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను సైతం శ్రేయస్ కోల్పోయాడు. తొలుత రంజీట్రోఫీలో ఆడేందుకు అయ్యర్ విముఖత చూపించడంతో అయ్యర్‌ను కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అయ్యర్‌తో పాటు మరో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌పై కూడా బీసీసీఐ వేటు వేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ముంబై.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. 114 ఓవర్లకు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ముంబై 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ముంబై ప్రస్తుతం 483 ఆధిక్యంలో కొనసాగుతోంది. ముంబై బ్యాటర్లలో అయ్యర్‌తో పాటు ముషీర్ ఖాన్(136) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. A confident fifty from Shreyas Iyer in the Ranji Trophy final with aggressive approach and looking good against Short balls. 👌pic.twitter.com/G7UReArVhd — Johns. (@CricCrazyJohns) March 12, 2024 -
బౌన్సర్ తాకి విలవిల్లాడుతుంటే..
న్యూఢిల్లీ : రంజీ ట్రోఫీ 2017-18 ఫైనల్ మ్యాచ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ జట్టు బౌలర్ వేసిన ఓ బౌన్సర్ ఛాతిని బలంగా తాకడంతో బ్యాట్స్‌మన్ నొప్పిని భరించలేక కుప్పకూలిపోయాడు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న అతన్ని ఓదార్చేందుకు ప్రత్యర్థి జట్టులోని ఒక్కరూ వెళ్లకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. క్రికెట్ నిజంగానే జెంటిల్మెన్ గేమేనా అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సహచర బ్యాట్స్‌మన్ బాధను చూడలేకపోయిన మరో బ్యాట్స్‌మన్ మెడికల్ హెల్ప్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు చేయి చూపించారు. ఇదే సమయంలో కుప్పకూలిన క్రికెటర్ నొప్పితో విలవిల్లాడుతున్నా అతని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు ఢిల్లీ ఆటగాళ్లు. ఈ వీడియోను తిలకించిన నెటిజన్లు ఢిల్లీ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్‌మన్‌షిప్‌ను మరచి ఢిల్లీ ఆటగాళ్లు ప్రవర్తించారని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఢిల్లీతో జరిగిన ఫైనల్లో విదర్భ జట్టు అద్భుత విజయం సాధించి తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. Sportsmanship ?! 🤔 A post shared by mahi7781 🔵 (@bleed.dhonism) on Dec 31, 2017 at 12:03am PST -
రంజీ ఫైనల్ సందడి షురూ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల విరామం తర్వాత ఉప్పల్ క్రికెట్ స్టేడియం రంజీ ట్రోఫీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. కర్ణాటక, మహారాష్ట్ర జట్ల మధ్య ఈ ఐదు రోజుల మ్యాచ్ బుధవారం నుంచి జరుగుతుంది. ఇందు కోసం హెచ్‌సీఏ సన్నాహకాలు పూర్తయ్యాయి. సోమవారం బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ కార్యదర్శి ఇ. వెంకటేశ్వరన్ మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మ్యాచ్ కోసం రెండు పిచ్‌లను సిద్ధం చేశారు. ఏ వికెట్‌పై ఫైనల్ నిర్వహించాలో మంగళవారం ఉదయం నిర్ణయిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక జట్లు సోమవారం చెరో రెండు గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాయి. ఫైనల్ మ్యాచ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేన్ క్రికెట్ ప్రముఖులందరినీ ఈ మ్యాచ్‌కు ఆహ్వానిస్తోంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ ఈ మ్యాచ్‌కు హాజరు కానున్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు సందీప్ పాటిల్, విక్రమ్ రాథోడ్, రాజీందర్‌సింగ్ హన్స్, రోజర్ బిన్నీ, సబా కరీమ్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకిస్తారు. రంజీ ట్రోఫీ మాజీ ఆటగాళ్లు, మాజీ ఆఫీస్ బేరర్లు, ఇతర అసోసియేషన్ల అధికారులకు హెచ్‌సీఏ ప్రత్యేకంగా ఆహ్వానం అందించింది.