న్యూఢిల్లీ : రంజీ ట్రోఫీ 2017-18 ఫైనల్ మ్యాచ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ జట్టు బౌలర్ వేసిన ఓ బౌన్సర్ ఛాతిని బలంగా తాకడంతో బ్యాట్స్‌మన్ నొప్పిని భరించలేక కుప్పకూలిపోయాడు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న అతన్ని ఓదార్చేందుకు ప్రత్యర్థి జట్టులోని ఒక్కరూ వెళ్లకపోవడం విస్మయానికి గురి చేస్తుంది.
క్రికెట్ నిజంగానే జెంటిల్‌మెన్ గేమేనా అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సహచర బ్యాట్స్‌మన్ బాధను చూడలేకపోయిన మరో బ్యాట్స్‌మన్ మెడికల్ హెల్ప్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు చేయి చూపించారు.
ఇదే సమయంలో కుప్పకూలిన క్రికెటర్ నొప్పితో విలవిల్లాడుతున్నా అతని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు ఢిల్లీ ఆటగాళ్లు. ఈ వీడియోను తిలకించిన నెటిజన్లు ఢిల్లీ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్‌మన్‌షిప్‌ను మరచి ఢిల్లీ ఆటగాళ్లు ప్రవర్తించారని కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఢిల్లీతో జరిగిన ఫైనల్లో విదర్భ జట్టు అద్భుత విజయం సాధించి తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment