న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో విరాట్ సేన అసమాన పోరాటపటిమ కనబరిచి.. 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఎన్నో మెరుపులు, మరెన్నో రికార్డులో కోహ్లి సేన సొంతం చేసుకుంది. అవి..
-
టెస్టుల్లో భారత్ తన అత్యధిక స్కోరును ఈ సిరీస్‌లోనే సాధించింది. చెన్నైలో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 759/7 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సొంతం చేసుకుంది.
-
కరుణ్ నాయర్ చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. అతని అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా టెస్టుల్లో తన అత్యధిక స్కోరు రికార్డును సాధించగలిగింది.
-
ఒకే సంవత్సరం మూడు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి 235 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
-
ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన వ్యక్తిగత పరుగులు 655. ఒక టెస్టు సిరీస్‌లో 600కుపైగా పరుగులు కోహ్లికి ఇది రెండోసారి. సునీల్ గవస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు పుటల్లోకి ఎక్కాడు.
-
రవిచంద్రన్ అశ్విన్ ఈ సిరీస్‌లో 25 వికెట్లు, 250కిపైగా పరుగులు చేయడం ద్వారా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా చరిత్ర సృష్టించాడు. అతను ఈ సిరీస్‌లో 306 పరుగులు చేయడమే కాదు, 28 వికెట్లు పడగొట్టాడు.
-
వందేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లు 20కిపైగా వికెట్లు పడగొట్టడం, రెండు అంతకుమించి అర్ధసెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్లుగా అశ్విన్, రవీంద్ర జడేజా నిలిచారు.
-
టెస్టు క్రికెట్‌లో మూడువేల పరుగులు మైలురాయిని దాటిన 20వ క్రికెటర్‌గా చటేశ్వర్ పూజారా, 21వ క్రికెటర్‌గా మురళీవిజయ్ నిలిచారు.
-
టెస్టుల్లో 4000వేల పరుగుల మైలురాయిని దాటిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు.
-
ఇంగ్లండ్ జట్టుపై భారత్‌కు ఇదే అతిపెద్ద సిరీస్ విజయం. 1993లో అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొంది.
- 2008 తర్వాత ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన తొలి టెస్టు సిరీస్ విజయం కూడా ఇదే. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టు సిరీస్‌లలోనూ భారత్ ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
-
140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 55 బంతుల్లో 51 పరుగులు చేసి, పది వికెట్లు తీసుకొని, నాలుగు క్యాచ్‌లు అందుకున్నతొలి క్రికెటర్‌గా జడేజా అద్భుతమైన రికార్డు సాధించాడు.