
అశ్విన్
చెమ్స్‌ఫోర్డ్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయాలతో కీలక పేసర్లైన భువనేశ్వర్ కుమార్ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. జస్ప్రిత్ బుమ్రా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయలేదు. దీంతో భారత శిబిరంలో కొంత కలవరపాటు నెలకొంది. ఆందోళన పడాల్సిన విషయం ఏమీ లేదని జట్టు మేనేజ్‌మెంట్ వెల్లడించినా.. అశ్విన్ ఆడటంపై అనేక ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే కీలక బౌలర్ల గాయాలతో బలహీనమైన బౌలింగ్ విభాగం అశ్విని గైర్హాజరుతో మరింత బలహీనం కానుంది.
అశ్విన్‌కు భవిష్యత్తు టెస్టుల దృష్ట్యా తొలి టెస్టుకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వన్డేల్లో రాణించిన కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కనుంది. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో కలిసి కుల్దీప్ జతకట్టనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment