
కరుణ్ నాయర్(ఫైల్‌ఫొటో)
విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడిన నాయర్ 48 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో చెలరేగిన నాయర్ 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అంతకముందు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. 42 బంతుల్లో 77 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అదే ఊపును తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కూడా కొనసాగించిన నాయర్ శతకంతో మెరిశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన తమిళనాడు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment