న్యూఢిల్లీ:వచ్చే నెల్లో దక్షిణాఫ్రికాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌కు ఎంపిక కాకపోవడం చాలా నిరాశకు గురిచేసిందని భారత తరపున కొద్ది మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కరుణ్ నాయర్ తెలిపాడు. జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఇప్పటికే జట్లను భారత సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టెస్టు జట్టులో చోటు ఆశించిన కరుణ్ నాయర్‌కి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. రెండు రోజుల క్రితం ప్రకటించిన వన్డే జట్టులోనూ చోటివ్వలేదు.
దీనిలో భాగంగా మాట్లాడిన కరుణ్ నాయర్..'దక్షిణాఫ్రికా పర్యటనకి నన్ను ఎంపిక చేయకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. గత ఏడాది ట్రిఫుల్ సెంచరీ చేశాను. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో కూడా కొన్ని శతకాలు సాధించాను. ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటారని ఆశించాను. కానీ ఎంపిక కాలేదు. ఆ ప్రభావం నా ఆటపై కూడా పడింది. రంజీల్లో ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నన్ను సఫారీ ఎంపిక చేయని ప్రభావం కనబడింది' అని కరుణ్ నాయర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్ తరపున సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment