
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందించిన ’పద్మావతి‘ చిత్ర వివాదాలు అనూహ్య మలుపులు తిరిగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో చరిత్రలను వక్రీకరించారని ఉదయ్‌పూర్ మేవార్ రాజవంశస్థులు ఆరోపిస్తున్నారు. తమ రాజపుత్రలు చరిత్రలను వక్రీకరించిన.. ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ.. ప్రధాని నరేంద్ర మోదీకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఛైర్మన్ ప్రసూన్ జోషికి మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్ లేఖ రాశారు. వారితో పాటు సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాలకు కూడా లేఖ రాశారు.
పద్మావతి చిత్రంలో రాజపుత్రలు చరిత్రను పూర్తిగా వక్రీకరించారని విశ్వరాజ్ సింగ్ ఆరోపించారు. హిందువుల చరిత్రను, భారతదేశ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని సింగ్‌లేఖలో పేర్కొన్నారు. రాణీ పద్మావతి చరిత్రకు గురించి పరిశోధనలు చేసి చిత్రాన్ని రూపొందించానన్న భన్సాలీ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాణీ పద్మావతి గురించి భన్సాలీ.. నన్ను కానీ, మా రాజపుత్రులను కానీ సంప్రదించలేదని సింగ్ స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించే ఇటువంటి చిత్రాలతో దేశానికి ప్రమాదమని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment