
సాక్షి, మేవార్ : సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం.. పద్మావతి విడుదలకు అనుమతివ్వడంపై మేవార్ రాజకుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి చిత్ర విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రాజవంశీకులు అసహనం వ్యక్తం చేశారు. సీబీఎఫ్‌సీ బృందం.. మేవార్ రాజవంశీయుల సూచనలను పరిగణలోకి తీసుకోలేదని మేవార్ వంశస్థుడు విశ్వరాజ్ సింగ్ అన్నారు.
‘పద్మావతి’ నుంచి ‘పద్మావత్’గా చిత్రం పేరును మార్చినంత మాత్రాన అందులో చూపించిన విషయాల్లో మార్పులు రావని అన్నారు. పద్మావతి చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించకుండా.. యూఏ సర్టిఫికెట్ ఇచ్చి విడుదలకు అనుమతించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డు తీసుకున్ని ఈ నిర్ణయం అనైతికమని, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment