మొదటి భర్త దాష్టీకం.. వీడియో క్లిప్‌ వైరల్‌ | Couple Attacked and Paraded Naked in Rajasthan | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 7 2018 1:20 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Couple Attacked and Paraded Naked in Rajasthan - Sakshi

వీడియోలోని దృశ్యాల ఆధారంగా చిత్రం

తనకు విడాకులివ్వకుండానే మరో వ్యక్తితో తాళి కట్టించుకుందన్న కోపంతో రగిలిపోయిన ఓ భర్త.. దాష్టీకానికి పాల్పడ్డాడు. భార్యను, ఆమె రెండో భర్తలపై దాడి చేసి.. నగ్నంగా ఊరేగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ వైరల్‌ కావటంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. 

జైపూర్‌: ఉదయ్‌పూర్‌లోని సరేఖూర్ద్‌ గ్రామంలో గమేటీ కులానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి, వేరే వ్యక్తితో కలిసి ఉంటోంది. అయితే కుల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో అతనితో తాళి కట్టించుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వ్యక్తితో భార్య నివసిస్తుండటాన్ని ఆమె మొదటి భర్త సహించలేకపోయాడు. శుక్రవారం ఉదయం ఆ జంటపై దాడి చేసి వారిని నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. స్థానికులు వారిని నిలువరించకపోగా.. వీడియోలు తీస్తూ ఆనందించారు. ఘటన తర్వాత పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితురాలు కూడా గప్‌చుప్‌గా ఉండిపోయింది. ఈ క్రమంలో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో సుఖేర్‌ టౌన్‌ పోలీసులు సీన్‌లోకి ఎంటర్‌ అయ్యారు. కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితుల్లో ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement