పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా పెళ్లి ఫోటో వైరల్‌ | Parineeti Chopra And Raghav Chadha Wedding Photo Trending On Social Media - Sakshi
Sakshi News home page

Parineeti Chopra-Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా పెళ్లి ఫోటో వైరల్‌

Published Mon, Sep 25 2023 10:00 AM | Last Updated on Mon, Sep 25 2023 11:05 AM

Parineeti Chopra And Raghav Chadha Wedding Photo Viral - Sakshi

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరిగిన వీరి పెళ్లి వేడుక ‍ అత్యంత వైభవంగా కొనసాగింది.

(ఇదీ చదవండి: 'విశ్వగానగంధర్వుడు' బాలసుబ్రహ్మణ్యం తొలి గురువు ఎవరు..?)

ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  అయితే వివాహం అనంతరం పరిణీతి-రాఘవ్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పరిణీతి  పింక్ చీరలో భర్త రాఘవ్ చద్దాతో కలిసి పోజులిచ్చారు. పరిణీతి నుదుటిపై సిందూరం ఉంది. దీంతో  ఈ ఫోటోలను వారిద్దరి అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో వారి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను కూడా షేర్‌ చేయనున్నారు.

ఈ వేడుకకి ఇరు కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దిల్లీ, పంజాబ్‌ల ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు కొత్త జంట రాగ్‌నీతీ (రాఘవ్‌, పరిణీతి)లను ఆశీర్వదించారు. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement