Hardik Pandya and Natasa Stankovic To Re Marry on Valentine's Day - Sakshi
Sakshi News home page

Hardik Pandya: మరోసారి నటిని పెళ్లాడనున్న హార్దిక్ పాండ్యా..!

Published Sun, Feb 12 2023 3:45 PM | Last Updated on Sun, Feb 12 2023 4:34 PM

Hardik Pandya and Natasa Stankovic to re marry on Valentine's Day - Sakshi

హార్దిక్ పాండ్యా క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ కాలంలోనే టీమిండియాకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అయితే హార్దిక్ పాండ్యా ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈ జంట మరోసారి పెళ్లికి సిద్ధమైంది. అదేంటి ఇప్పటికే పెళ్లయిన జంటకు మరోసారి పెళ్లేంటీ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేసేయండి. 

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఫిబ్రవరి 13 నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ కోసం హార్దిక్, నటాషా ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున ఉదయపూర్‌లో ఈ జంట మరోసారి వివాహం చేసుకోనుంది. ఈనెల 13 నుంచి 16 వరకు హల్దీ, మెహెందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలతో వెడ్డింగ్‌ వైభవంగా జరగనుంది. పెళ్లయిన మూడేళ్లకు మరోసారి ఈ జంట వివాహం చేసుకోవడం విశేషం.

కాగా.. జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా.. మే 31, 2020న సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూలై 2020లో వారి బాబు జన్మించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తమ కుమారుడి ఫోటోలు, వీడియోలను పంచుకుంటారు. నటాషా 2013 చిత్రం సత్యాగ్రహ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత యాక్షన్ జాక్సన్ (2014), ఫుక్రే రిటర్న్స్ (2017) వంటి చిత్రాలలో నటించింది. ఆమె బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో కూడా కనిపించింది. ఆ తర్వాత బాద్షా బ్లాక్ బస్టర్ ట్రాక్ డీజే వాలీ బాబు సినిమాలోనూ కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement