తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై..అప్పుడే ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఇక ఈ రోజున తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు.
ప్రత్యేకత..
ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు. కొందరు వెన్న ముద్దలు అంటే..బియ్యపిండి, వెన్నతో చేసిన ముద్దలను డీప్ ఫ్రేచేసి చివరగా పానకంలో వేసి..నైవేద్యంగా సమర్పిస్తారు.
(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!)
Comments
Please login to add a commentAdd a comment