తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగే ఈ బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆట, పాటలతో జానపద గేయాలతో హుషారు తెప్పించే సంప్రదాయ పండుగ. చూస్తుండగానే ఎనిమిదిరోజుల వేడుకలు ముగిసి..తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి.
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మని కొలుస్తారు. ఈ రోజు అత్యంత పెద్దదిగా బతుకమ్మను తయారు చేసి ఆట పాటలతో సందడి చేస్తారు. ఈ చివరి రోజు వేడుకను ఊరు, వాడ దద్దరిల్లేలా పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. సద్దుల బతుకమ్మ రోజున ఎన్ని రకాల పూలు దొరికితే, అన్ని రకాల పూలు అమర్చుకుని ఎత్తైన బతుకమ్మను తయారుచేస్తారు.
ఈరోజు బతుకమ్మను నిమజ్జంన చేసిన అనంతరం.. పెరుగన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి, పులిహోర, ఇలా పలు రకాల నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.
(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!)
Comments
Please login to add a commentAdd a comment