Saddula Bathukamma
-
సందడిగా సద్దుల బతుకమ్మ.. ఆటపాటలతో ఆడబిడ్డలు
-
Saddula Bathukamma: తెలంగాణలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు (ఫోటోలు)
-
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటాపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో నేడు ముగుస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున ముగింపు వేడుకలను ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించారు.ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క, ప్రముఖులు హజరయ్యారు.సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద బతుకమ్మ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.సిరిసిల్ల పట్టణం: సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సద్దుల బతుకమ్మ వేడుకలకి అంతరాయం కలిగింది. దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు. -
పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగే ఈ బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆట, పాటలతో జానపద గేయాలతో హుషారు తెప్పించే సంప్రదాయ పండుగ. చూస్తుండగానే ఎనిమిదిరోజుల వేడుకలు ముగిసి..తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మని కొలుస్తారు. ఈ రోజు అత్యంత పెద్దదిగా బతుకమ్మను తయారు చేసి ఆట పాటలతో సందడి చేస్తారు. ఈ చివరి రోజు వేడుకను ఊరు, వాడ దద్దరిల్లేలా పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. సద్దుల బతుకమ్మ రోజున ఎన్ని రకాల పూలు దొరికితే, అన్ని రకాల పూలు అమర్చుకుని ఎత్తైన బతుకమ్మను తయారుచేస్తారు.ఈరోజు బతుకమ్మను నిమజ్జంన చేసిన అనంతరం.. పెరుగన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి, పులిహోర, ఇలా పలు రకాల నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
హాంగ్ కాంగ్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు. లాంటౌ ద్వీపం లో క్రొత్తగా నిర్మించబడ్డ వాటర్ ఫ్రంట్ ప్రోమేనాడ పై అందమైన ఆకాశంలో నక్షత్రాల మెరుపుల క్రింద, రంగు రంగుల పూలతో అందంగా తయారైన గౌరమ్మను మెరిసే పట్టు చీరలు, నగలలో అందాల భామలు, అందమైన నవ్వులతో, పిల్ల - పాపలతో ఆడపడుచులందరూ చక చక తరిలి వచ్చారు. తుంగ్ చుంగ్ మెట్రో స్టేషన్ నుండి కేవలం కొద్ది దూరంలో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్, జాగర్స్, బైకర్స్, డాగ్ వాకర్స్ మరియు విహార యాత్రలకు వచ్చే వారితో ప్రసిద్ది చెందింది, ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రక్రుతిని ఆస్వాదించటానికి సరైన ప్రదేశం. హాంకాంగ్, న్యూ టెరిటరీస్ లో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్ 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ పార్క్ సహజ దృశ్యాలతో పాటు, ఈ పార్కులో పిల్లలు, పెద్దలు మరియు వయో వృద్ధులు అందరికి అనువైన అందమైన విహార స్థలం. చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు తంగేడు, గునుగు మొదలగు పూలను ఇంటిళ్ళపాదీ స్నేహితులు కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.ఈ పూలను జాగ్రత్తగా ఒక పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చి, ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. చీకటి పడుతుండగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని వాటర్ ఫ్రంట్ కి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు లో బతుకమ్మ పాటలు బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో పాడుతూ అందంగా అలంకిరించుకున్నబాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. చూస్తున్న స్థానికులు ఆశ్చర్యంగా , ఆనందంగా చూస్తూ ఫోటోలు తీసుకుంటారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ప్రోమేనాడ చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడి పాడారు. ఇలా చాలా సేపు ఆడాక గౌరమ్మను పూజించి వెళ్ళి రావే బతుకమ్మ అంటూ సముద్రంలో నిమజ్జనం చేసారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన సత్తుపిండి (మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి, వాటిని పిండి చేసి, వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) వాయనాలను ఇచ్చి పుచ్చుకొని ప్రసాదం సేవించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరవ సంవత్సరం జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని ఆనందంగా తెలుపుతూ, ఈ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. THKTS సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని అన్నారు. నవంబర్ లో కార్తిక వనభోజనాలు మరియు దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. -
పూలవనం.. వైభవంగా తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా రేపు(ఆదివారం) సద్దుల బతుకమ్మను సంబురంగా జరుపుకోనున్నారు. ఇక, హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ చివరి రోజు ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. #HYDTPinfo Commuters, please make a note of #TrafficAdvisory in view of #SaddulaBathukamma, celebrated on 22-10-2023 at #LumbiniPark & Upper #TankBund.#TrafficAlert #Bathukamma #Festival #Celebrations #Dussehra #Dussehra2023 @AddlCPTrfHyd pic.twitter.com/WMp9Qcpiqa — Hyderabad Traffic Police (@HYDTP) October 21, 2023 ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు. ►సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్ రూట్లోకి మళ్లిస్తారు. ►నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. ►హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్లాలి. ►సికింద్రాబాద్ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతించరు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు. ►ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్-ఉపకార్ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్ వద్ద మళ్లిస్తారు. ►బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న మీ కోసం పార్కింగ్ ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను కేటాయించారు. -
బతుకమ్మ సంబరాలు షురూ.. నేడే ఎంగిలిపూల బతుకమ్మ
తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డలా పండుగ.. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగకు సమయం ఆసన్నమైంది. భాద్రపద అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పండగకు తెలంగాణ ముస్తాబైంది. ఏర్పాట్లకు సర్వం సిద్ధమయ్యాయి. నేటి(శనివారం) నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. చివరిరోజైన దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో.. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు.గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు ఒక్కో రోజు.. ఒక్కోలా.. మొదటి రోజు: బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు: బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇది ఆశ్వీయుజ మాసం మొదటి రోజైనపౌడ్యమి రోజున నిర్వహిస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు: బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మను చేస్తారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు. ఐదో రోజు: అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు అట్లు(దోసలు) తయారు చేస్తారు. అమ్మకు నైవేద్యంగా పెడతారు. ఆరో రోజు: అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజు బతుకమ్మ పేర్చరు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు. ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి, నూనెలో వేయిస్తారు. వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ. చాలా ముఖ్యమైన రోజు. ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో బతుకమ్మ ఉత్సవాలను ముగిస్తారు. -
హాంగ్ కాంగ్లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దసరా శరన్నవరాత్రులు ఎంతగానో ఇష్టంగా ఎదురుచూసే పండుగా అని చెప్పవొచ్చును . లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలు, గర్భాలు, దాండియా ఆటలతో పాటు బతుకమ్మ సంబరాలు కూడా విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు - దసరా (విజయ దశమి) మరియు బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, తొమ్మిది రోజులలో, రోజు ఉదయం, సాయంత్రం, ఎవరింటీలో లలిత పారాయణం చేస్తారు అంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి..ఇటువంటి వివరాలతో ఒక పట్టికను తయారు చేస్తారు, హాంగ్ కాంగ్ లాంటావ ద్వీపంలోని తుంగ చుంగ్ 'లలిత సహస్రనామం చాంటింగ్ గ్రూప్'. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు పెడతారు. విచ్చేసిన ఆడపడుచులందరు పారాయణానికి వెళ్తూ, పూలు పండ్లు కాకుండా వారి శక్తికొలది ఒక డొనేషన్ బాక్స్ లో ధనాన్ని వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని మన దక్షిణ రాష్ట్రాలలోని ఏదైనా ఒకటి రెండు వృద్ధాశ్రమానికి లేదా అనాధ పిల్లల ఆశ్రమానికి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్ ను ప్రారంభించిన శ్రీమతి సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామందరు కలసి మానవ సేవ - మాధవ సేవ చేసుకోగల్గుతున్నందుకు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తోందని అన్నారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. అంటే బెంగాలీ వారు దుర్గాష్టమి నాడు ఘనంగా వేడుక చేసుకున్నట్లు, తెలుగింటి ఆడపడుచులు సద్దులబతుకమ్మ వేడుకలు జరుపుకొంటారు. ఈ శుభకృత నామ సంవత్సరం, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆడపడుచులు, స్థానికంగా ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో వుత్సాహంగా సద్దుల బతుకమ్మను ఆరాధిస్తు బతుకమ్మ ఆడారు అని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. తమ సమాఖ్య మహిళా విభాగం "సఖియా" సంయుక్త కార్యదర్శి శ్రీమతి కొండ నాగ మాధురి, శ్రీమతి జెఖ అశ్విని రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ పండుగ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం తనకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని, తన బంధు మిత్రులతో కలిసి ఆనందంగా బతుకమ్మ ఆడారని, అందమైన బొమ్మల కొలువులు చూశానని, లలిత దేవి పారాయణం - పేరంటాలకి వెళ్లానని చెప్పారు. చాలా కాలం తరువాత హైద్రాబాద్ లో ఈ పండుగ చేసుకోవడం ఒక మరపురాని మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆనందంగా తెలిపారు. త్వరలో తమ సమాఖ్య దీపావళి వేడుకలని ఘనంగా చేసే ఏర్పాట్లు చేస్తోందని సంతోషంగా ప్రకటించారు. -
బట్టలు కొనలేదని బలవన్మరణం
భీమారం(చెన్నూర్): సద్దుల బతుకమ్మ పండుగకు తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్ఐ గట్ల సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి శంకరయ్య, శంకరమ్మ దంపతులు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి కూతురు వనిత (20) ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ కోసం కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడింది. మంగళవారం ఉదయం మళ్లీ తల్లితో గొడవ పడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో చికిత్స నిమి త్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోని భీమారం వద్ద చనిపోయింది. -
హైదరాబాద్: సద్దుల బతుకమ్మ సంబురం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక అంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించేలా నగర ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల మీదుగా కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ ♦అబిడ్స్ చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బిజెఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని ఎఆర్ పెట్రోల్ పంపు మీదుగా మళ్లిస్తారు. ♦బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ మూసివేసి ఆ వాహనాలను ఎస్బిఐ గన్ఫౌం డ్రీ వైపు మళ్లిస్తారు. ♦రవీంద్రభారతి, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి వైపు వెళ్లాలి. ♦నారాయణగూడ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమయత్‌నగర్ వై జంక్షన్ వైపు వెళ్లాలి ♦కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు ఇలా... ♦కెపిహెచ్బి, మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులు ఏఆర్ పెట్రోల్ పుంపు మీదుగా నాంపల్లి వైపు మళ్లించారు ♦కోఠి నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్సులు కాచిగూడ, నారయణగూడ, హిమయత్‌నగర్ మీదుగా వెళ్లాలి పార్కింగ్ ఇలా... ♦వీఐపీ, అధికారుల కోసం టెన్నిస్ గ్రౌండ్ వద్ద. ♦ప్రింట్ ఆండ్ మీడియా ప్రతినిధుల కోసం సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్ద. ♦ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం నిజాం కళాశాల మైదానం వద్ద.. -
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో.. మళ్లీ రా బతుకమ్మ..ఉయ్యాలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోలాహలం సందడి సందడిగా కొనసాగుతోంది. తీరొక్క పూలతో మహిళలంతా వీధివీధినా బతుకమ్మను పేర్చి ఆడిపాడే వేడుక తుది దశకు చేరుకుంది. మహాలయ అమావాస్య నుంచి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, తొమ్మిది రోజులు, నైవేద్యాలు, తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. పోయిరా బతుకమ్మ ఉయ్యాలో ..మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ నాడు ఆ గౌరమ్మ తల్లికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, సత్తుపిండి, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి గౌరమ్మకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేయడంతోఈ వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల ఉత్సాహాన్ని ఏడాదంతా నింపుకుంటారు ఆడబిడ్డలు. -
నేడు, రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ఉత్సాహంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు ముగింపుదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడుకలను ముగించుకున్న తెలంగాణ ఆడపడుచులు వెన్నముద్దల బతుకమ్మ సంబరానికి సిద్దమవుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటున్నారు. బతుకమ్మ ముగింపు ఉత్సవాల ముగింపు వేడుక అయిన సద్దుల బతుకమ్మ పండుగ కొన్ని ప్రాంతాలు నేడే నిర్వహిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో రేపు (గురువారం) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో స్థానిక సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకునేందుకు ఆయా ప్రాంతాల వాసులు రడీ అవుతున్నారు. దుర్గాష్టమినాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా, కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు.అయితే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడాల్సిందే అని తీర్మానించుకున్న వారు గురువారం సద్దుల బతుకమ్మను నిర్వహించుకోనున్నారు. ఇక హైదరాబాద్‌లో దుర్గాష్టమినాడే (నేడే) బతుకమ్మ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఎంఎల్సీ కవిత కూడా ఈ మేరకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్ చేశారు. ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.#బతుకమ్మ #Bathukamma pic.twitter.com/WxYc9Oh36W — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 13, 2021 -
సింగపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు
సింగపూర్: సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు వారి సహకారంతో అంగరంగ వైభవంగా శనివారం బతకమ్మ సంబరాలు జరిగాయి. ఈ పండుగను సింగపూర్ తెలుగు సమాజం వారు సుమారు 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా ప్రతీ ఏడాది నిర్వహిస్తోంది. కరోనా కోరల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు వారందరి క్షేమం మేరకు ప్రత్యేక ఉద్దేశంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలను సాంఘిక మాధ్యమాల ద్వారా జరిపారు. కోవిడ్-19 నిబంధనలు కారణంగా, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఐదుగురు-ఐదుగురు సమూహంగా జూం యాప్ ద్వారా, అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో, కోలాటాల విన్యాసాలతో సద్దుల బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొని వేడుక జరుపుకున్నారు. క్లిష్ట సమయంలో సైతం పండుగ శోభ ఏమాత్రం తగ్గకుండా రకరకాల పువ్వులతో అనేక రంగురంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ అలరించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జూమ్ యాప్ ద్వారా ఈ వేడుకను ఉద్ధేశించి మాట్లాడారు. కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లోని తెలుగు వారు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ పండుగ విశిష్టతను ఆంతర్యాన్ని వివరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ... మనిషి ప్రకృతితో మమేకమయ్యే పండుగలలో అతి పెద్దదైన ఈ బతుకమ్మ పూల పండుగ ఘనమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. వెయ్యి సంత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్‌లో సాంప్రదాయబద్ధంగా పెద్దఎత్తున నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరుపున ఆయన బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ తెలంగాణా ఫ్రెండ్స్ తరుపున కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున పండగ చేసుకొనే మనం ప్రత్యేక పరిస్ధితులలో జూమ్ ద్వారా కూడా అట్టహాసంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. టాస్- మనం తెలుగు తరుపున అనితా రెడ్డి మాట్లాడుతూ... ప్రాంతాలు, మాండలికాలు వేరైనా అందరం కలసికట్టుగా, సంసృతి సాంప్రదాయాలతో పాటు బంధాలు తెలిపే పండుగ ఈ బతుకమ్మ అని తెలియజేశారు. చివరగా ఈ కార్యక్రమం నిర్వహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న మాట్లాడుతూ... ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు, సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులు, టాస్ - మనం తెలుగు వారికి , స్పాన్సర్లకు కార్యదర్శి సత్యచిర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
సద్దుల బతుకమ్మ వేడుకలు..
-
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’ అంటూ ఆడపడుచులు బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల వర్షం బతుకమ్మ వేడుకలకు ఇబ్బందిగా మారింది. అయినా మహిళలు వర్షాన్ని లెక్కచేయకుండా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆడేందుకు నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. సద్దుల బతుకమ్మ వేడుకలు.. సిద్ధిపేట జిల్లా కోమటిచెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మంత్రి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులతో కలిసి ఆయన బతుకమ్మ, దాండియా ఆడారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. -
సది పెట్టాము సల్లంగ చూడమ్మా
బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి. సల్లంగా చూసే తల్లి. సకల శుభాలనిచ్చే తల్లి. ఆ తల్లికి ప్రీతైన సద్దులు పెట్టడం భక్తుల ఆనవాయితీ. సద్ది పెడదాము. శరణు కోరుదాము. పెరుగు సద్ది కావలసినవి: అన్నం – 1 గ్లాసు; పెరుగు – 1 గ్లాసు; పాలు – 1/2 గ్లాసు; ఎండు మిరపకాయలు – 3; మినప్పప్పు – 1 టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర – టీ స్పూను చొప్పున; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 3 టీ స్పూన్లు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►అన్నం మెత్తగా వండి మెదిపి పెట్టుకోవాలి ►పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి ►ఒక చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేయాలి ►తర్వాత మినప్పప్పు, సెనగపప్పు వేసి కాస్త వేగాక కరివేపాకు వేసి దింపి, కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో కలపాలి ►ఇందులో గోరువెచ్చని పాలు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాల తర్వాత వడ్డించాలి ►పాలు కలపడం వల్ల అన్నం పులుపెక్కకుండా కమ్మగా ఉంటుంది. మలీద కావలసినవి: గోధుమ పిండి – 1 కప్పు; ఉప్పు – చిటికెడు; బెల్లం తురుము – 1/2 కప్పు; ఏలకుల పొడి – 1/2 టీ స్పూను; నెయ్యి – 4 టీ స్పూన్లు. తయారీ: ►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి ►తర్వాత ఉండలు చేసుకుని చపాతీలు చేసి కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి ►వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బెల్లం తురుము కలిపి మెత్తగా దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి తిప్పాలి ►బయటకు తీసి నెయ్యి, ఏలకుల పొడితో పాటు, ఇష్టముంటే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి ►ఆరిన తర్వాత డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. కొబ్బరి సద్ది కావలసినవి: బియ్యం – 100 గ్రా.; పచ్చి కొబ్బరి పొడి – 100 గ్రా.; ఎండు మిరపకాయలు – 3; జీలకర్ర – 1/4 టీ స్పూను; ఆవాలు – 1/4 టీ స్పూను; మినప్పప్పు– 1 టీ స్పూను; సెనగపప్పు – 1 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; పల్లీలు – 50 గ్రా.; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 5 టీ స్పూన్లు. తయారీ: ►అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు కలిపి చల్లారనివ్వాలి ►ఒక గిన్నెలో నూనె వేడి చేసి పల్లీలు వేసి కాస్త వేగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేగాక, కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు వేయించాలి ►ఈ పోపునంతా అన్నంలో వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాక తినాలి (పోపు, కొబ్బరి... దోరగా వేగాలి, ఎర్రబడకూడదు). నిమ్మ సద్ది కావలసినవి: బియ్యం – 2 కప్పులు; నిమ్మకాయలు – 2; ఎండు మిరపకాయలు – 2; పచ్చి మిరపకాయలు – 2; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్ చొప్పున; మినప్పప్పు – 1 టీ స్పూన్; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పల్లీలు – పావు కప్పు; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 3 టీ స్పూన్లు. తయారి: ►అన్నం పొడిపొడిగా వండి చల్లారాక, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ►బాణలిలో నూనె వేడి చేసి పల్లీలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ►ఇందులో నిలువుగా చీల్చిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి కలిపి దింపేసి నిమ్మ రసం పిండాలి ►మొత్తం కలిపి అన్నంలో వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►పది నిమిషాల్లో తినడానికి రెడీగా ఉంటుంది. నువ్వుల సద్ది కావలసినవి: బియ్యం – 4 కప్పులు; నువ్వులు – 1/2 కప్పు; ఎండు మిరపకాయలు – 4; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెబ్బలు; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర – 1/2 టీ స్పూను చొప్పున; పసుపు – 1/4 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 5 టీ స్పూన్లు. తయారి: ►బియ్యం కడిగి అరగంట నానిన తరవాత కొద్దిగా పలుకుగా (పొడిపొడిగా ఉండేలా) వండి చల్లార్చుకోవాలి ►బాణలిలో ఎండు మిర్చి, నువ్వులు దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ►వెడల్పాటి గిన్నెలో అన్నం తీసుకుని పొడిపొడిగా చేసుకుని చెంచాడు నూనె, పసుపు, తగినంత ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టి మూతపెట్టి ఉంచాలి ►మరో గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ►ఆవాలు, జీలకర్ర, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి ►పచ్చి సెనగ పప్పు, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత దింపేసి అన్నంలో వేసి కలపాలి ►మొత్తం బాగా కలిపి మూత పెట్టి అరగంట తర్వాత తినొచ్చు చింతపండు సద్ది కావలసినవి: బియ్యం – 2 కప్పులు; చింతపండు పులుసు – సగం కప్పు; ఎండు మిర్చి – 5; జీలకర్ర, ఆవాలు – 1/4 టీ స్పూను; మినప్పప్పు – 1 టీ స్పూను; సెనగ పప్పు – 1 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – 1/4 టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెబ్బలు; నూనె – 5 టీ స్పూన్లు. తయారి: ►బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానిన తర్వాత కొద్దిగా పలుకుగా వండి చల్లార్చుకోవాలి ►ఒక వెడల్పాటి గిన్నెలో అన్నం చల్లారబెట్టి పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ►మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి ►అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడాక పల్లీలు, మినప్పప్పు, సెనగ పప్పు, కరివేపాకు వేసి వేగిన చింతపండు పులుసు వేసి చిక్కబడేవరకు ఉడికించాలి ►చివరలో కరివేపాకు, కొంచెం బెల్లం వేసి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి ►కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి బాగా కలియబెట్టి పది నిమిషాలు ఉంచితే చాలు. కర్టెసీ: జ్యోతి వలబోజు, హైదరాబాద్ నాన్–వెజ్ నాటు కోడి ఫ్రై కావలసినవి:నాటుకోడి – అర కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; నూనె – 3 టీ స్పూన్లు; ఉల్లి తరుగు–పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; మిరియాల పొడి – అర టీ స్పూను; జాజికాయ–చిన్న ముక్క; గరం మసాలా – టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత, జీడిపప్పులు – 50 గ్రా.; టొమాటో తరుగు – కప్పు; పుదీనా – ఒక కట్ట; కొత్తిమీర – చిన్న కట్ట; నిమ్మ రసం–ఒక టీ స్పూను; కరివేపాకు–రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను. తయారీ: ►నాటుకోడి ముక్కలను శుభ్రం చేసి నీళ్లతో కడగాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి, కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, గరం మసాలా, కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, టొమాటో తరుగు, జీడి పప్పులు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►చికెన్ ముక్కలను కూడా వేసి వేయించాలి. ►ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి ►ఉడికించిన ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలియబెట్టాలి ►చివరగా నిమ్మ రసం, కొత్తిమీర, పుదీనా తరుగుతో అలంకరించి దింపి, వేడి వేడిగా అందించాలి. పాయా షోర్వా కావలసినవి: పాయా – 4; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – 2 టీ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; గరం మసాలా – టేబుల్ స్పూను; జీలకర్ర పొడి – టీæ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; పుట్నాల పప్పు – 50 గ్రా.; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పుదీనాఆకులు – ఒక కట్ట. తయారీ: ►పాయా ముక్కలను ఉప్పు, నిమ్మ రసంతో శుభ్రంగా కడగాలి ►కొద్దిగా ఉప్పు, పసుపు చేసి బాగా కలిపి, మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి ►మిక్సీలో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి తురుము వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగిన తరవాత, గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి ►టొమాటో తరుగు వేసి బాగా కలిపిన తరవాత, మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమం జత చేయాలి ►ఊరబెట్టిన పాయాను జత చేసి బాగా కలియబెట్టి, తగినన్ని నీళ్లు పోయాలి ►సుమారు అరగంట సేపు ఉడికించిన తరవాత దింపేసి తరిగిన పుదీనా ఆకులతో అలంకరించాలి. రొయ్యల పులావ్ కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; బాస్మతి బియ్యం – అర కేజీ; నెయ్యి – 100 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; గరం మసాలా – ఒక టీ స్పూను; పెరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; కారం – ఒక టీ స్పూను; ఉప్పు– తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; పుదీనా – చిన్న కట్ట; బిర్యానీ ఆకు – 1; షాజీరా – అర టీ స్పూను; జీడిపప్పులు – 50 గ్రా.; కిస్మిస్ – 50 గ్రా.; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి ►రొయ్యలను శుభ్రం చేసి, ఉప్పు, నిమ్మరసంతో కడగాలి ►మిక్సీలో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి ►టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కనుంచాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక, జీడిపప్పులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►మిగిలిన నేతిలో... షాజీరా, బిర్యానీ ఆకు, గరం మసాలా, ఉల్లి + పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి ►రొయ్యలను జత చేసి బాగా కలిపి మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, టొమాటో ముద్ద వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేయాలి ►నీళ్లు బాగా మరిగాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలియబెట్టాలి ►మూడు వంతులు ఉడికిన తరవాత, మంట బాగా తగ్గించి ఉడికిన తరవాత దింపేసి, ఒక బౌల్లోకి తీసుకుని, జీడిపప్పు, కిస్మిస్, కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి. తెలంగాణ చేపల పులుసు కావలసినవి: చేపముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – ఒక కట్ట; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మిరప కారం – 3 టీ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; వేయించిన మెంతులు – ఒక టేబుల్ స్పూను; చింతపండు గుజ్జు – ఒక కప్పు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►చేప ముక్కలను బాగు చేసి కడిగి పక్కన ఉంచాలి ►ఉప్పు, పసుపు, కారం జత చేసి, కలిపి మూత ఉంచాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఊర బెట్టిన చేపముక్కలను వేసి వేయించి పక్కన ఉంచాలి ►స్టౌ మీద ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►జీలకర్ర పొడి, మెంతుల పొడి, మిరప కారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి ►టొమాటో తరుగు వేసి ఒకసారి కలిపిన తరవాత చింత పండు పులుసు, తగినన్ని నీళ్లు పోయాలి ►చేప ముక్కలను వేసి కలిపి, పైన మూత ఉంచాలి ►ముక్కలను ఉడికిన తరవాత మంట తీసేయాలి ►పైన సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి మూత ఉంచాలి ►వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. తవ్వ గ్రిల్డ్ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అర కేజీ (పెద్ద ముక్కలు); నూనె – కొద్దిగా; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – కొద్దిగా; పచ్చి మిర్చి ముద్ద – ఒక టేబుల్ స్పూను; ఆవ నూనె – 2 టీ స్పూన్లు; వాము – అర టీ స్పూను; చాట్ మసాలా – కొద్దిగా; చీజ్ తురుము – కొద్దిగా; సతాయ్ స్టిక్స్ – ఒక ప్యాకెట్; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కనుంచాలి ►ఒక పెద్ద పాత్రలో చికెన్ ముక్కలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా కలపాలి ►ఉప్పు, పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి సుమారు అర గంట సేపు పక్కన ఉంచాక, మూత తీసి కారం, మిరియాల పొడి, ఏలకుల పొడి, ఇంగువ, ►జీలకర్ర పొడి, నిమ్మ రసం, చీజ్ తురుము, ఆవ నూనె, కొత్తిమీర వేసి బాగా కలియబెట్టి పక్కన ఉంచాలి ►సతాయ్ స్టిక్స్ తీసుకుని చికెన్ ముక్కలను ఒకదాని తరవాత ఒకటి గుచ్చాలి ►స్టౌ మీద తవ్వ ఉంచి వేడి చేయాలి ►కొద్దిగా నూనె వేసి బాగా కాగాక చికెన్ ముక్కలను ఒకదాని పక్కన ఒకటి అమర్చాలి ►బాగా మెత్తబడే వరకు కాలనివ్వాలి (గ్రిల్ మీద ఉంచినప్పుడు మంట సిమ్‌లో మాత్రమే ఉండాలి) ►బాగా కాలిన తరవాత వాటిని ప్లేట్లోకి తీసుకుని, అమర్చాలి ►కొత్తిమీరతో అలంకరించి అందించాలి. చింత చిగురు మాంసం కూర కావలసినవి: మటన్ – అర కేజీ; చింత చిగురు – 150 గ్రా.; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 5; నూనె – 50 మి. లీ.; జీలకర్ర – ఒక టీ స్పూను; కారం – 3 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – తగినంత; నీళ్లు – సరిపడా. తయారీ: ►మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత చిగురును శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి ►సిద్ధంగా ఉంచిన మటన్ జత చేసి బాగా కలియబెట్టాలి ►పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి గరిటెతో కలపాలి ►టొమాటో తరుగు వేసి బాగా కలిపి, చింత చిగురు కూడా జత చేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి కుకర్ మూత ఉంచి ఆరేడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చివరగా సిద్ధంగా ఉంచిన కొత్తిమీరను పైన అలంకరించాలి ►అన్నంలోకి, రోటీలలోకి ఈ కూర రుచిగా ఉంటుంది. – కర్టెసీ: స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, భువనేశ్వర్ -
ట్యాంక్‌బండ్ : ఘనంగా సద్దుల బతుకమ్మ
-
వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా!
సాక్షి, హైదరాబాద్: ‘మా బంగారు బతుకమ్మ.. పో యిరావమ్మా’, ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’, అని పాడుతూ.. బుధవారం సాయంత్రం సద్దుల బతుకమ్మకు తెలంగాణ ఆడపడుచులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ పైనున్న బతుకమ్మ ఘాట్, లలితకళా తోరణం, రవీంద్రభారతిలతోపాటు నగరంలోని వివిధ చెరువు గట్ల వద్ద బుధవారం బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఆ«ధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆడపచుడుల ఆటపాటలు, టపాసుల వెలుగుల మధ్య బతుకమ్మ నిమజ్జన సంబరం అంబరాన్నంటింది. దీనికితోడు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం నుంచి కుండపోత వర్షం కారణంగా ప్రారంభంలో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారు తప్ప.. ఇతర ప్రాంతాలవారు పెద్దగా కనిపించలేదు. కానీ..వర్షం తెరిపిచ్చిన తర్వాత (రాత్రి 7.45 అనంతరం) ఒక్కొక్కరుగా వేలాది మంది బతుకమ్మ ఘాట్ చేరుకున్నారు. ట్యాంక్‌బండ్ పండుగశోభ సంతరించుకుంది. బ్రహ్మకుమారీలు కుల్దీప్ సిస్టర్స్, సంతోష్ దీదీ సిస్టర్స్ బతుకమ్మలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శోభాయమానంగా సాంస్కృతిక యాత్ర బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ఆడపడుచులు, 850 మంది కళాకారుల ప్రదర్శనలు, వారిని చూసేందుకు వచ్చిన ఆశేష జనంతో ట్యాంక్‌బండ్ కిటకిటలాడింది. అంబేద్కర్ విగ్రహం వద్ద సాంస్కృతిక యాత్ర (కల్చరల్ కార్నివాల్)ను సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలు జెండా ఊపి ప్రారంభించారు. చిందు, యక్షగాన, బైండ్ల, ఒగ్గు, డప్పులు, కొమ్ము కొయ్య, లంబాడీ, గుస్సాడీ, చిరుతల భజన, డోళ్లు మ్రోగిస్తూ కళాకారులు బతుకమ్మలతో కలిసి ముందుకుసాగారు. మహారాష్ట్ర కళాకారులు నిర్వహించిన ‘డోల్ తాషా’నృత్యం యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగే పండుగల్లో బతుకమ్మ పండుగ తెలంగాణకు ఓ బ్రాండ్‌గా మారిందని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ మంది ఒకచోట చేరి నిర్వహించుకునే ఏకైక పండుగ ఇదేనన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా.. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాలన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద బాణసంచా వెలుగుల మధ్య అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు లేజర్ షోతో బతుకమ్మ కథ మారియట్ హోటల్ సమీపంలో హుస్సేన్‌సాగర్ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకొంది. బతుకమ్మ కథను లేజర్ షో ద్వారా ప్రజలకు వివరించారు. పబ్బుల్లో లాగా డ్యాన్స్‌ఫ్లోర్ ఏర్పాటు చేసి బతుకమ్మ బొమ్మలు, కథలు వివరించారు. 75 మంది మహిళా విదేశీ కళాకారులు బతుకమ్మ చేపట్టి బతుకమ్మ ఆటపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనను చూసేందుకు జనం ఎగబడటంతో.. వారిని అదుపు చేసేందుకు పోలీసులకు తిప్పలు తప్పలేదు. హుస్సేన్ సాగర్ నీటిలో ఫాటింగ్ బతుకమ్మలను పది చిన్న పడవ (పుట్టి)ల్లో ఉంచారు. అయితే.. వర్షం కారణంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించిన పారామోటరింగ్, బెలూన్ కార్యక్రమాలు వాయిదా వేశారు. మొత్తం అయిదు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలు గురువారానికి వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అకాల వర్షం కారణంగా ‘ఆకాశంలో బతుకమ్మ’కార్యక్రమాన్ని రద్దు చేసిట్లు అధికారులు చెప్పారు. -
పూల పండగొచ్చింది...
-
నేటి నుంచి బతుకమ్మ పండుగ
-
ఏమేమి పువ్వొప్పునే.. గౌరమ్మ!
సాక్షి, హైదరాబాద్: ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ...’ అంటూ తీరొక్క పువ్వులను పేర్చి భక్తితో కొలిచే తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బతుకమ్మ పండుగ ఉత్సవాలు మంగళవారం మొదలవ్వనున్నాయి. ఆటపాటలతో పల్లెల్లో ఆనందం నింపే ఈ పండుగ 9 రోజుల పాటు సాగనుంది. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మతో ఉత్సవాలు ముగియనున్నాయి. అన్ని గ్రామాల్లోనూ బతుకమ్మను ఘనంగా నిర్వహిం చాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రత్యేకతల పండుగ... బతుకమ్మ పండుగకు ఓ విశిష్టత ఉంది. ఈ పండుగలో పాటలదే ప్రాధాన్యత. పూర్తిగా ప్రకృతి, ఆత్మీయతలు, జీవనశైలిని తెలియజెప్పేలా పాటలుం టాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృ తిక అస్తిత్వం నిలుపుకునే ప్రక్రియలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత పెరిగింది. వానాకాలం ముగింపు, చలికాలం మొదలయ్యే రోజుల్లో ఈ పండుగ వస్తుంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున తొలిరోజు (ఎంగిలిపూల) బతుకమ్మతో పండుగ మొదలవుతుంది. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. బతుకమ్మను పూలతో పేర్చడం, మట్టిలో ఆడటం, నీళ్లలో కలపడం అంతా ప్రకృతితో మమేకమైన ప్రక్రియ. బతుకమ్మకు వినియోగించే ఒక్కో పువ్వులో ఒక్కో రకమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా తయారు చేసే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంది. వర్షాకాలంలో వచ్చే ఆహార పంటలతో ప్రసాదాలను తయారు చేస్తారు. హైదరాబాద్‌లో 9 రోజుల పాటు... బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్ని శాఖలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజా, రవీంద్రభారతి, బైసన్‌పోలో, పరేడ్‌గ్రౌండ్స్, తెలంగాణ కళాభారతి మైదానాల్లో 9 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సద్దుల బతుకమ్మ రోజున 21 దేశాలకు చెందిన మహిళలు ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో, ఢిల్లీల్లోని తెలంగాణభవన్‌లోనూ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
వరంగల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు
-
నేడు సద్దుల బతుకమ్మ సంబరాలు