నిజామాబాద్ అర్బన్: జిల్లాలో గురువారం సద్దుల బతుకమ్మ ఘనంగా జరిగింది. మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు సా యం త్రం బతుకమ్మలను సిద్ధం చేసుకొని పాటలు పాడి చెరువులలో నిమజ్జనం చేశారు. నిజాం సాగర్ మండలం మహమ్మద్‌నగర్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. బిచ్కుంద మండలంలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే పాల్గొన్నారు. నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
పూలాంగ్ వాగు, ఖిల్లా రఘునాథాల యం, కంఠేశ్వర్, దుబ్బ, న్యాల్‌కల్‌రోడ్డు, వినాయక్‌నగర్, సుభాష్‌నగర్, తదితర ప్రాం తాలలో మహిళలు, యువతులు పెద్ద సం ఖ్యలో సద్దుల బతుకమ్మ ఆడారు. కంఠేశ్వర్ వద్ద టి-కాంగ్రెస్ మహిళ విభాగం అధ్యక్షురాలు ఆకుల లలిత తదితరులు బతుకమ్మ ఆ డారు. అధికార యంత్రాంగం బతుకమ్మను నిమజ్జనం చేసే ప్రాంతాలలో తగు సౌకర్యాలను కల్పిచింది. నగరమంతా మహిళలు, యువతులు, చిన్నారులతో సందడిగా కనిపించింది.
సంబురంగా సద్దుల బతుకమ్మ
Published Fri, Oct 3 2014 2:04 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement