hanmanth Sindhi
-
సంబురంగా సద్దుల బతుకమ్మ
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో గురువారం సద్దుల బతుకమ్మ ఘనంగా జరిగింది. మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు సా యం త్రం బతుకమ్మలను సిద్ధం చేసుకొని పాటలు పాడి చెరువులలో నిమజ్జనం చేశారు. నిజాం సాగర్ మండలం మహమ్మద్‌నగర్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. బిచ్కుంద మండలంలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే పాల్గొన్నారు. నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పూలాంగ్ వాగు, ఖిల్లా రఘునాథాల యం, కంఠేశ్వర్, దుబ్బ, న్యాల్‌కల్‌రోడ్డు, వినాయక్‌నగర్, సుభాష్‌నగర్, తదితర ప్రాం తాలలో మహిళలు, యువతులు పెద్ద సం ఖ్యలో సద్దుల బతుకమ్మ ఆడారు. కంఠేశ్వర్ వద్ద టి-కాంగ్రెస్ మహిళ విభాగం అధ్యక్షురాలు ఆకుల లలిత తదితరులు బతుకమ్మ ఆ డారు. అధికార యంత్రాంగం బతుకమ్మను నిమజ్జనం చేసే ప్రాంతాలలో తగు సౌకర్యాలను కల్పిచింది. నగరమంతా మహిళలు, యువతులు, చిన్నారులతో సందడిగా కనిపించింది. -
ఆరు నెలల్లో పూర్తవ్వాలి ‘లెండి’
నిజాంసాగర్ : లెండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తెలిపారు. వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సాగునీటి ప్రాజెక్టుల పనులను కాంట్రాక్టర్లతో సకాలంలో పూర్తిచేయించాలని ఆదేశించారన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేల సమక్షంలో సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను ఎమ్మెల్యే ‘సాక్షి’తో వివరించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు సీడీ-1, సీడీ-2 జీరో డిస్ట్రిబ్యూటరి నుంచి ప్రధాన కాలువ 7 ఏ డిస్ట్రిబ్యూటరి వరకు మరమ్మతుల కోసం రూ. 9 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించామన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానన్నారని పేర్కొన్నారు. మండలంలోని నల్లవాగు మత్తడి కుడి, ఎడమ కాలువల సిమెంట్ లైనింగ్ పనులు పునరుద్ధరించాలని కోరానని ఎమ్మెల్యే తెలిపారు. సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టని కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి 15 రోజుల్లో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాలని సూచించామన్నారు. పిట్లం మండలంలోని వెంపల్లి మత్తడి పనుల కోసం 15 రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు మిగులు జలాలకు దిగువ భాగాన బ్యారేజ్ నిర్మించాలని మంత్రిని కోరామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఏదుల్కావ్ చెరువులోకి నీటిని నింపి, వజ్రఖండి చెరువు వరకు నీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. బిజ్జల్ వాడి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారని వివరించారు. సమావేశంలో పిట్లం జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారని తెలిపారు. -
తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణానికి పాటు పడుతూ అభివృద్ధి పనుల కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తామని జహీరాబాద్ లోక్‌సభ సభ్యుడు బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. సోమవారం పిట్లం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్, జుక్కల్ టీఆర్ఎస్ ఎ మ్మెల్యేగా గెలుపొందిన హన్మంత్‌సింధేలతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలను నిర్వహించాయి. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు అసెంబ్లీ,లోక్‌సభ స్థానాల కు టీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు వారు ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, వ్యాపార పరంగా వెనుకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక నా యకులు పిట్లం జడ్పీటీ సీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, నాయకులు రజనీకాంత్ రెడ్డి, నర్సాగౌడ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.