‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ...’ అంటూ తీరొక్క పువ్వులను పేర్చి భక్తితో కొలిచే తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బతుకమ్మ పండుగ ఉత్సవాలు మంగళవారం మొదలవ్వనున్నాయి. ఆటపాటలతో పల్లెల్లో ఆనందం నింపే ఈ పండుగ 9 రోజుల పాటు సాగనుంది.