హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటాపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో నేడు ముగుస్తున్నాయి.
ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున ముగింపు వేడుకలను ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించారు.ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క, ప్రముఖులు హజరయ్యారు.
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద బతుకమ్మ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణం: సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సద్దుల బతుకమ్మ వేడుకలకి అంతరాయం కలిగింది. దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment