హైదరాబాద్, సాక్షి: బతుకమ్మ వేడుకల షెడ్యూల్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రేపటి (బుధవారం) నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది.
10న ట్యాంక్‌బాండ్‌లో బతుకమ్మ వేడుకలు..లేజర్‌షో జరగనుంది. అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్‌వరకు వెయ్యి బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక.. బతుకమ్మ వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.
చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
Comments
Please login to add a commentAdd a comment