shedule released
-
TG: బతుకమ్మ వేడుకల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: బతుకమ్మ వేడుకల షెడ్యూల్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రేపటి (బుధవారం) నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. 10న ట్యాంక్బాండ్లో బతుకమ్మ వేడుకలు..లేజర్‌షో జరగనుంది. అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్వరకు వెయ్యి బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక.. బతుకమ్మ వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలుతెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ -
ఈ నెల 21న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ EAPCET(ఎంసెట్) నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. 21న నోటిఫికేషన్ విడుదల చేసి.. 26వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇక.. ఏప్రిల్ 6 తేదీ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ. మే 9వ తేదీ నుంచి 12 తేదీ వరకు ఆన్లైన్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ ఎప్‌సెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. ఈ నెల 6వ తేదీన ఎప్‌సెట్ తొలి సమావేశం.. తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరగనుంది. చదవండి: తెలంగాణ ఎంసెట్ పేరు మార్పు.. పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల -
డీఎడ్ కాలేజీల దందాకు చెక్
సాక్షి, అమరావతి: ప్రైవేటు డీఎడ్ కాలేజీల అక్రమ ప్రవేశాల దందాకు అడ్డుకట్ట పడింది. 2018-20 బ్యాచ్‌లో అనధికారిక ప్రవేశాలు పొందిన వారందరూ పరీక్షలకు దూరమయ్యారు. కేవలం అధికారిక ప్రవేశాలు పొందిన వారు మాత్రమే పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 5 నుంచి 11 వరకు వీరికి పరీక్షలు నిర్వహించనున్నారు. 67 వేల సీట్లు.. 14,530 మందే అర్హులు 2018-20 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎడ్ ప్రవేశాల కోసం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన డీసెట్‌కు 22 వేల మంది వరకు దరఖాస్తు చేయగా.. 18 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2 వేల మంది వరకు అర్హత సాధించారు. డీసెట్ పరీక్ష రాసేందుకు ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించాలి. ఇక డీసెట్‌లో ఓసీ, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు రావాలి. అలా అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 744 డీఎడ్ కాలేజీలుండగా.. ప్రభుత్వ కాలేజీలు 21 మాత్రమే ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 67 వేల వరకు సీట్లున్నాయి. డీసెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన వారికి ఈ కాలేజీల్లో కన్వీనర్ కోటాద్వారా ప్రవేశాలు కల్పించాలి. అయితే అర్హత సాధించిన వారు 2 వేల మందే ఉండటంతో.. అప్పట్లో పలు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టచెప్పి ఓసీ, బీసీలకు అర్హత మార్కులను 30 శాతానికి తగ్గించేలా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులను పూర్తిగా ఎత్తివేసేలా ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అలా మార్కులు తగ్గించినా కూడా 14,530 మందే అర్హత సాధించారు. వీరికి అప్పట్లో కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించారు. 25 వేల వరకు అనధికారిక ప్రవేశాలు.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరో 25 వేల మందిని అనధికారికంగా చేర్చుకున్నాయి. ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశాయి. వీరిలో అనేక మంది డీసెట్ కూడా రాయలేదు. ఇంటర్లో నిర్ణీత అర్హత మార్కులూ సాధించలేదు. అయినా వీరిని అనధికారికంగా చేర్చుకొని.. గతంలో మాదిరిగా కన్వీనర్ ద్వారా అనుమతులిప్పించే ప్రయత్నం చేశాయి. విద్యార్థులకు కూడా ఈ మేరకు మాయమాటలు చెప్పి పెద్ద ఎత్తున ప్రవేశాలు జరిపాయి. వీటన్నింటికీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనధికారిక చేరికలకు చెక్ పెట్టింది. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. కానీ అక్కడ కూడా కాలేజీలకు చుక్కెదురయ్యింది. ఈ నేపథ్యంలో 21,085 మంది విద్యార్థులకు 178 సెంటర్లలో వచ్చే నెల 5 నుంచి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 14,530 మంది ఉండగా.. ప్రైవేటు విద్యార్థులు 6,555 మంది ఉన్నారు. కాగా, అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.వోఆర్జీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి సూచించారు. -
త్వరలోనే పరీక్షలు..క్వారంటైన్ పూర్తి చేసి రావాలి
బెంగుళూరు : కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పదోతరగతి సహా వివిధ పరీక్షలను రద్దు చేస్తూ ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీకి చెందిన ఇన్స్టిట్యూట్ మాత్రం పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది. సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాలంటూ విద్యార్థులకు ఈ- మెయిల్స్ పంపించింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారు ప్రభుత్వం ఆదేశించిన 14 రోజుల క్వారంటైన్ నిబంధనల్ని పాటించాలని పేర్కొంది. దీంతో కరోనా సమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ నిబంధనలతో పాటు వసతి కల్పనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. కాబట్టి తాత్కాలికంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. (కంపెనీ ఉద్యోగులకు కరోనా.. బాధితులు పరార్ ) సాధారణంగా అయితే జూన్ చివరి వారంలో పరీక్షలు జరగాలి. కానీ కరోనా కారణంగా ఆగస్టు 3 నుంచి 21 మధ్యకాలంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ సదరు ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ఈ -మెయిల్ ద్వారా షెడ్యూల్ పంపింది. అంతేకాకుండా రాష్ర్టంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల దృష్ట్యా అత్యధిక కేసులు వెలుగుచూస్తున్న కోవిడ్ కేంద్రాలను గుర్తించి వాటి సరిహద్దు ప్రాంతాలను మూసివేయాలని ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదేశించిన సంగతి తెలిసిందే. లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. (కర్ణాటక ప్రభుత్వానికి సూచించిన మాజీ సీఎమ్ ) -
అమర్నాథ్ యాత్ర : లాటరీ పద్దతిలో భక్తుల ఎంపిక
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం తీపికబురు అందించింది. యాత్రా ప్రణాళికను సిద్దం చేసిన ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతీ ఏడాది లక్షలాది మంది తరలివచ్చే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ఒకటి. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా యాత్రకు బ్రేక్ పడుతుందేమో అన్న సందేహాల నడుమ భక్తులకు శుభవార్త అందించింది. అమర్నాథ్ యాత్ర జులై 21న మొదలుకొని 15 రోజుల్లో తీర్థయాత్ర ముగియనుంది. సాధారణంగా అయితే 45 రోజుల వరకు యాత్ర కొనసాగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రోజుల వరకు భక్తులను అనుమతించడం ద్వారా మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రణాళికలో మార్పులు చేసింది. అంతేకాకుండా బాల్తాల్ మార్గంలోనే యాత్రకు అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి కేవలం నాలుగువేల నుంచి ఐదు వేల మంది యాత్రికులకు మాత్రమే అనుతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. (2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్ ) సాధారణంగా అయితే బాల్తాల్ సహా పహల్గామ్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగేది. కానీ కోవిడ్ దృష్ట్యా పహల్గామ్ దారిని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తీర్థయాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు బసీర్ అహ్మద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని తాజా ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన మంచు-లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఏటా దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. లక్షలసంఖ్యలో ప్రతీ ఏటా జులై చివరివారంలో 45 రోజులపాటు తీర్థయాత్ర కొనసాగుతుంది. అయితే గత ఏడాది ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో భద్రతా సమస్యల దృష్ట్యా యాత్రను మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా షెడ్యూల్లో కేవలం 15 రోజులకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు ) -
వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ
కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్‌సభా స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ దీంతోపాటు మరికొన్ని స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలును బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అయితే, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికకు మాత్రం షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. నవంబర్ 21వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీనికి ఈనెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ ఎన్నికకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి... అక్టోబర్ 28 - నోటిఫికేషన్ విడుదల నవంబర్ 4 - నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ నవంబర్ 5- నామినేషన్ల పరిశీలన నవంబర్ 7 - ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 21 - ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 24 - ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన