వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ | warangal bye election to be held on 21st november | Sakshi
Sakshi News home page

వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ

Published Wed, Oct 21 2015 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ

వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ

కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్‌సభా స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ దీంతోపాటు మరికొన్ని స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలును బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అయితే, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికకు మాత్రం షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. నవంబర్ 21వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీనికి ఈనెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ ఎన్నికకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి...

అక్టోబర్ 28 - నోటిఫికేషన్ విడుదల
నవంబర్ 4 - నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ
నవంబర్ 5- నామినేషన్ల పరిశీలన
నవంబర్ 7 - ఉపసంహరణకు తుది గడువు
నవంబర్ 21 - ఉప ఎన్నికల పోలింగ్
నవంబర్ 24 - ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement