సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’ అంటూ ఆడపడుచులు బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల వర్షం బతుకమ్మ వేడుకలకు ఇబ్బందిగా మారింది. అయినా మహిళలు వర్షాన్ని లెక్కచేయకుండా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆడేందుకు నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి.
సద్దుల బతుకమ్మ వేడుకలు..
- సిద్ధిపేట జిల్లా కోమటిచెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మంత్రి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులతో కలిసి ఆయన బతుకమ్మ, దాండియా ఆడారు.
- సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment