స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.6,66,66,666.66 కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.
మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని, పూజా మండపాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి విచ్చేశారు.
యాదగిరిగుట్ట కిటకిట
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలి వచ్చారు. ధర్మ దర్శనానికి సుమారు 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని సుమారు 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.32,50,448 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment